RCB Fans | హైదరాబాద్‌లో ఆర్సీబీ అభిమానుల రచ్చ.. లాఠీలకు పనిచెప్పిన పోలీసులు
RCB Fans | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. మొదటి కప్‌కోసం 18 ఏండ్లు ఎదురుచూసిన ఆర్సీబీ.. 12 నెలల్లోనే రెండో ట్రోఫీని సొంతం చేసుకుంది.
RCB Fans | త్రినేత్ర.న్యూస్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. మొదటి కప్‌కోసం 18 ఏండ్లు ఎదురుచూసిన ఆర్సీబీ.. 12 నెలల్లోనే రెండో ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానుల (RCB Fans) ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్‌లో రజత్ పాటిధార్ సేన గుజరాత్‌పై విజయం సాధించింది. దీంతో హైదరాబాద్‌లో ఆ జట్టు అభిమానులు ఘనంగా సంబురాలు చేసుకున్నారు. అయితే అది కాస్తా హద్దు మీరడంతో పోలీసులు లాఠీలకు (Lathi Charge) పనిచెప్పారు.
తమ అభిమాన జట్టు రెండో సారి ఐపీఎల్ ట్రోఫీని నెగ్గడంతో ఆర్సీబీ ఫాన్స్ సచివాలయం వద్దకు భారీగా చేరుకున్నారు. డీజేపాటలకు స్టెప్పులు వేస్తూ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే కొందరు అతిగా ప్రవర్తించడంతో పరిస్థితి అదుపుతప్పింది. సచివాలంయం వద్ద ఉన్న బారికేడ్లను కింద పడేస్తూ బీభత్సం సృష్టించారు. అరుపులు, కేకలతో హంగామా చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినా వినకపోవడంతో లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. లాఠీ దెబ్బలను తప్పించుకునేందుకు పరుగులు పెట్టించారు. ఫాన్స్ కేకలు, పోలీసుల యాక్షన్‌తో కొద్దిసేపు అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది.
HYDలో రచ్చ చేసిన RCB ఫ్యాన్స్‌పై లాఠీఛార్జ్
ఐపీఎల్ ఫైనల్స్‌లో జీటీపై ఆర్సీబీ గెలవడంతో హైదరాబాద్‌లో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. వందలాది మంది ట్యాంక్ బండ్, సచివాలయం వద్దకు చేరి హంగామా చేశారు. కొందరు అత్యుత్సాహంతో కార్లపైకి ఎక్కి కేకలు వేస్తూ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం… pic.twitter.com/zTdjC94cr6
— ChotaNews App (@ChotaNewsApp) June 1, 2026
విశాఖ, కర్నూల్‌లోనూ..
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, కర్నూల్ లోనూ ఇలాంటి పరిస్థితే కనిపించింది. కర్నూల్ లో రోడ్డుపైకి వచ్చిన అభిమానులు ఏకంగా బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. రోడ్లపై మంటలు పెడుతూ డ్యాన్సులు చేస్తూ హంగామా సృష్టించారు. దీంతో అక్కడ కూడా పోలీసులు యువకులపై లాఠీచార్జ్ చేశారు. విశాఖపట్నంలోని బీచ్ రోడ్డుకు ఫ్యాన్స్ భారీగా పోటెత్తి, కారు ఎక్కి మరీ రచ్చ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు.
We are a nation of uncivilised idiots!
Celebrating the victory of RCB in the IPL match, “fans” of RCB went berserk on roads of Kurnool, Andhra Pradesh.
They started pelting stones, breaking windows of buses and bursting firecrackers on the main roads.
Absolute nonsense &… pic.twitter.com/1sTM8HxWmJ
— Revathi (@revathitweets) June 1, 2026
ఆర్సీబీ ఘనవిజయం.. బెంగళూరు, వైజాగ్‌లో ఫ్యాన్స్ రచ్చ
ఐపీఎల్-19 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నిలిచి, వరుసగా రెండోసారి టైటిల్ కొట్టడంతో అభిమానుల సంబరాలు మిన్నంటాయి. ఆర్సీబీ హోంగ్రౌండ్ బెంగళూరు నగరం టపాసుల మోతతో దద్దరిల్లింది. అటు విశాఖపట్నంలోని బీచ్ రోడ్డుకు ఫ్యాన్స్… pic.twitter.com/BLJFb7XJIw
— ChotaNews App (@ChotaNewsApp) May 31, 2026
కొట్టుకున్న ఫ్యాన్స్
ఐపీఎల్ ఫైనల్ జోష్ ఓ పబ్‌లో తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఆర్సీబీ జట్టుపై ఎవరో చేసిన చిన్న విమర్శతో వివాదం మొదలైంది. దీంతో మాటామాట పెరిగి రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది తెలియాల్సి ఉంది. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఘోరంగా కొట్టుకున్న ఫ్యాన్స్
ఐపీఎల్ ఫైనల్ జోష్ ఒక పబ్‌లో తీవ్ర ఘర్షణకు దారితీసింది. RCB జట్టుపై ఎవరో చేసిన చిన్న విమర్శతో వివాదం మొదలైంది. దీంతో మాటామాట పెరిగి రెండు వర్గాల క్రికెట్ అభిమానులు ఒకరిపై ఒకరు ఘోరంగా దాడి చేసుకున్నారు. ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్… pic.twitter.com/i71QThvoW6
— ChotaNews App (@ChotaNewsApp) June 1, 2026
Yesterday RCB won the trophy, but their toxic fans lost common sense and damaged public and private properties in various states across India.
(Secretariat,Hyd, kphb hyd , Kurnool AP, Nagpur Maharashtra)#RCBnation #IPL19 #RCB pic.twitter.com/f7WKDiM8MI
— avengers.... (@A__Reddy) June 1, 2026
తాజావార్తలు
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల






