Donald Trump | ట్రంప్‌కు గట్టి షాక్.. ఇరాన్‌పై సైనిక చర్యను నిలిపివేసే తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం
Donald Trump | ఇరాన్ యుద్ధం (Iran war) విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు గట్టి షాక్ తగిలింది. టెహ్రాన్‌పై సైనిక చర్యను నిలిపివేసే తీర్మానానికి అమెరికా ప్రతినిధుల సభ (House of Representatives) బుధవారం ఆమోదం తెలిపింది.
International | Published On Jun 4, 2026, 10.32 am IST
Donald Trump | పశ్చిమాసియాలో గత మూడు నెలలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించే దిశగా కీలక ముందడుగు పడింది. ఇరాన్ యుద్ధం (Iran war) విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు గట్టి షాక్ తగిలింది. టెహ్రాన్‌పై సైనిక చర్యను నిలిపివేసే తీర్మానానికి అమెరికా ప్రతినిధుల సభ (House of Representatives) బుధవారం ఆమోదం తెలిపింది.
ఇరాన్‌పై సైనిక చర్యలకు దిగే విషయంలో అధ్యక్షుడి అధికారాలను నియంత్రించేందుకు ఉద్దేశించిన వార్ పవర్స్ రిజల్యూషన్ తీర్మానాన్ని సభలో (US House) ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్ జరగ్గా.. 215 ఓట్లు అనుకూలంగా, 208 ఓట్ల వ్యతిరేకంగా వచ్చాయి. నలుగురు రిపబ్లికన్ (Republicans) ప్రతినిధులు కూడా డెమోక్రాట్లతో (Democrats) కలిసి ఈ తీర్మానానికి మద్దతు తెలపడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ తీర్మానం ఆమోదం పొందడంతో.. కాంగ్రెస్ స్పష్టమైన అనుమతి లేకుండా ఇరాన్‌లో గానీ, ఇరాన్‌కు వ్యతిరేకంగా గానీ జరిగే ఘర్షణల్లో అమెరికా సైన్యం పాల్గొనేందుకు వీలుండదు. దీంతో ట్రంప్ యుద్ద వ్యూహానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. మరోవైపు ఈ తీర్మానం ఆమోదం పొందడంతో సభలో హర్షధ్వానాలు మిన్నంటాయి.
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసింది..
తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసిందని ప్రకటించారు. ఈ ఆపరేషన్ అమెరికా విజయం సాధించినట్లు హౌస్ ఫారెన్ అఫైర్స్ కమిటీకి చెప్పారు. ఇరాన్ రక్షణ రంగ పరిశ్రమలను దెబ్బతీశామని వెల్లడించారు. ఇకపై ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బ తీసేందుకు అమెరికా దాడులు చేయబోదని స్పష్టం చేశారు.
Also Read..
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. స్వల్పంగా తగ్గిన చమురు ధరలు..
సంబంధిత వార్తలు

US Tariffs | భారత్‌పై అమెరికా 100 శాతం టారీఫ్‌లు.. తుదిదశకు బిల్లు
సెప్టెంబర్ 16, 2026

DK Shivakumar | ట్రంప్ కూడా కాంగ్రెస్ పథకాలనే కాపీ కొడుతున్నారు.. డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
సెప్టెంబర్ 15, 2026

Trump’s New H-1B Rule | ఉద్యోగం పోతే ఇంటికే.. ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. ఆందోళనలో టెకీలు
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●22ఏ నుంచి కేసీఆర్ కుటుంబ భూముల వరకు.. అసెంబ్లీలో రేవంత్ ‘మూడంచెల వ్యూహం’ ఇదేనా?
- ●Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!
- ●Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!
- ●TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Operation Polo | విలీనం.. 78 ఏళ్లు
- ●Harish Rao | మేం పోలేదు.. పథకం ప్రకారం సస్పెండ్ చేసినవ్

22ఏ నుంచి కేసీఆర్ కుటుంబ భూముల వరకు.. అసెంబ్లీలో రేవంత్ ‘మూడంచెల వ్యూహం’ ఇదేనా?

Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!

Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!

TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి



