Fire Accident | ఐసీయూలో చెలరేగిన అగ్నికీలలు.. నలుగురు రోగులు మృతి
Fire Accident | దేశ రాజధాని ఢిల్లీలోని మాలవీయ నగర్‌లోని ఓ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే బీహార్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
Fire Accident | త్రినేత్ర.న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీలోని మాలవీయ నగర్‌లోని ఓ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే బీహార్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చెలరేగిన అగ్నికీలలు నలుగురు రోగుల ప్రాణాలను బలిగొన్నాయి.
ముజఫర్‌పూర్ జిల్లాలోని ప్రసాద్ హాస్పిటల్‌లో గురువారం తెల్లవారుజామున 3.55 గంటల సమయంలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 20 మంది రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. మరో నలుగురు రోగులు మంటల్లో చిక్కుకుని సజీవదహనం అయ్యారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
నిన్న ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోగా, 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో 40 మంది అతిథులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
సంబంధిత వార్తలు

KTR | రేవంత్ రెడ్డి ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ : కేటీఆర్
సెప్టెంబర్ 15, 2026

Uterus | ఆ యువకుడికి వృషణాలు లేవు.. పరీక్షలో బయటపడ్డ గర్భాశయం
సెప్టెంబర్ 11, 2026

BRS Complaint to NHRC | అసెంబ్లీ వద్ద చాలా అవమానం జరిగింది.. ఎన్హెచ్ఆర్సీకి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదు
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●22ఏ నుంచి కేసీఆర్ కుటుంబ భూముల వరకు.. అసెంబ్లీలో రేవంత్ ‘మూడంచెల వ్యూహం’ ఇదేనా?
- ●Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!
- ●Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!
- ●TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్రెడ్డి
- ●Operation Polo | విలీనం.. 78 ఏళ్లు
- ●Harish Rao | మేం పోలేదు.. పథకం ప్రకారం సస్పెండ్ చేసినవ్

22ఏ నుంచి కేసీఆర్ కుటుంబ భూముల వరకు.. అసెంబ్లీలో రేవంత్ ‘మూడంచెల వ్యూహం’ ఇదేనా?

Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!

Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!

TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్రెడ్డి



