త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bunker Buster Bombs | హ‌ర్మూజ్ స‌మీపంలోని ఇరాన్ క్షిప‌ణి స్థావ‌రాల‌పై బంక‌ర్ బ‌స్ట‌ర్ బాంబులతో విరుచుకుప‌డిన యూఎస్‌

Bunker Buster Bombs | ఇరాన్‌పై అమెరికా యుద్ధం మ‌రింత‌ తీవ్ర‌త‌ర‌మైంది. చ‌మురు ర‌వాణాకు కీల‌కంగా ఉన్న హ‌ర్మూజ్ జ‌ల‌సంధిని తెరిపించేందుకు అమెరికా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఇందులో భాగంగానే ఆ జ‌ల‌మార్గం స‌మీపంలో ఉన్న ఇరాన్ క్షిప‌ణి స్థావ‌రాల‌పై యూఎస్ సైన్యం విరుచుకుప‌డింది.

D

International | Published On Mar 18, 2026, 11.01 am IST

Bunker Buster Bombs | హ‌ర్మూజ్ స‌మీపంలోని ఇరాన్ క్షిప‌ణి స్థావ‌రాల‌పై బంక‌ర్ బ‌స్ట‌ర్ బాంబులతో విరుచుకుప‌డిన యూఎస్‌
Advertisement

Bunker Buster Bombs | ఇరాన్‌పై అమెరికా యుద్ధం మ‌రింత‌ తీవ్ర‌త‌ర‌మైంది. చ‌మురు ర‌వాణాకు కీల‌కంగా ఉన్న హ‌ర్మూజ్ జ‌ల‌సంధిని తెరిపించేందుకు అమెరికా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఇందులో భాగంగానే ఆ జ‌ల‌మార్గం స‌మీపంలో ఉన్న ఇరాన్ క్షిప‌ణి స్థావ‌రాల‌పై యూఎస్ సైన్యం విరుచుకుప‌డింది. అత్యంత శ‌క్తివంత‌మైన బాంబుల‌తో దాడి చేసింది. తీరప్రాంతం వెంబడి ఉన్నఇరాన్ క్షిప‌ణి స్థావ‌రాల (Iranian missile sites)పై 5,000 పౌండ్ల (సుమారు 2,268 కిలోగ్రాములు) బరువున్న 'డీప్ పెనెట్రేటర్' బాంబుల (deep penetrator bombs)ను ప్రయోగించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (US Central Command) తాజాగా ప్రకటించింది.

"హ‌ర్మూజ్ జలసంధి (Strait of Hormuz)సమీపంలోని ఇరాన్ పటిష్టమైన క్షిపణి స్థావరాలపై 5,000 పౌండ్ల శ‌క్తివంత‌మైన బంక‌ర్ బ‌స్ట‌ర్ బాంబుల (Bunker Buster Bombs)తో విజ‌య‌వంతంగా దాడి చేశాం" అని యూఎస్ సెంట్ర‌ల్ క‌మాండ్ ఎక్స్‌లో పేర్కొంది. ఆ ప్రాంతంలో ఉన్న ఇరాన్ యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులు హ‌ర్మూజ్ జ‌ల‌సంధిలో అంత‌ర్జాతీయ నౌక‌ల షిప్పింగ్‌కు ముప్పుగా మారాయ‌ని పేర్కొంది. అందుకే వాటిపై దాడులు చేసిన‌ట్లు వెల్ల‌డించింది. దాడి చేసిన ప్రాంతాల‌కు చెందిన మ్యాప్‌ను కూడా సెంట్ర‌ల్ క‌మాండ్ రిలీజ్ చేసింది.

https://x.com/CENTCOM/status/2034040698954031326

సాధార‌ణంగా బంక‌ర్ బ‌స్ట‌ర్ బాంబుల‌ను భూగ‌ర్భంలో ఉండే ల‌క్ష్యాల‌ను ధ్వంసం చేసేందుకు ఉప‌యోగిస్తారు. గ‌తేడాది కూడా ఇరాన్‌పై అమెరికా ఇలాంటి బాంబుల‌నే ప్ర‌యోగించిన విష‌యం తెలిసిందే. ఇరాన్ అణు కేంద్రాలపై 30,000 పౌండ్ల బ‌రువున్న బాంబుల‌ను ప్ర‌యోగించింది. ఈ బాంబుల‌తో పోలిస్తే తాజాగా ప్ర‌యోగించిన బంక‌ర్ బ‌స్ట‌ర్ చాలా త‌క్కువ శ‌క్తివంత‌మైన‌వి. ఇక ఒక్కో బంక‌ర్ బ‌స్ట‌ర్‌ బాంబును త‌యారు చేసేందుకు సుమారు 2.88 ల‌క్ష‌ల డాల‌ర్లు ( రూ.2.4 కోట్లు) ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నా.

ఇదిలా ఉండగా.. హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికా చమురు కంపెనీలు కూడా ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాయి. త్వరగా పరిష్కారం కనుగొనకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని ట్రంప్ (Donald Trump)ను హెచ్చరించాయి. దీంతో హార్మూజ్ జ‌ల‌సంధిలో నౌక‌ల‌కు ర‌క్ష‌ణ‌గా యుద్ధ నౌక‌ల‌ను పంపాల‌ని ఏడు దేశాల‌ను ట్రంప్‌ కోరారు. అయితే, అమెరికాకు అత్యంత స‌న్నిహిత మిత్ర‌దేశాలైన ఆస్ట్రేలియా, జ‌పాన్ త‌దిత‌ర దేశాలు ఇందుకు నిరాక‌రించాయి.

Also Read..

Benjamin Netanyahu | నేను బ‌తికే ఉన్నాను.. అమెరికా రాయ‌బారితో ఇజ్రాయెల్ ప్ర‌ధాని ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌

అమెజాన్‌లో రియ‌ల్‌మి ప్ర‌త్యేక సేల్‌.. త‌గ్గింపు ధ‌ర‌ల‌కు నార్జో సిరీస్ ఫోన్లు..

కొత్త వారికీ రైతుభ‌రోసా.. ప్రారంభ‌మైన‌ ద‌ర‌ఖాస్తులు.. ఏయే ప‌త్రాలు ఉండాలంటే?

Advertisement

తాజావార్తలు

Advertisement