Rythu Bharosa | కొత్త వారికీ రైతుభరోసా.. ప్రారంభమైన దరఖాస్తులు.. ఏయే పత్రాలు ఉండాలంటే?
Rythu Bharosa | యాసంగి సీజన్ పంట పెట్టుబడి సాయం అందించేందు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. మార్చి 22న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రైతు భరోసా (Rythu Bharosa) నిధులను అన్నదాతలకు విడుదల చేయనున్నారు.
Rythu Bharosa | త్రినేత్ర.న్యూస్: యాసంగి సీజన్ పంట పెట్టుబడి సాయం అందించేందు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. మార్చి 22న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రైతు భరోసా (Rythu Bharosa) నిధులను అన్నదాతలకు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకంలో కొత్త రైతుల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇప్పటివరకు పంటపెట్టుబడి సాయం పొందని రైతుల నమోదు ప్రక్రియను (New Registrations) మార్చి 25 వరకు చేపట్టనున్నారు. అయితే ఫిబ్రవరి 28 నాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయిన రైతులకు మాత్రమే అవకాశం కల్పించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతులు తమ పట్టాదారు పాసుపుక్తం, ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలను అప్లికేషన్ ఫారంలో నింపి రైతువేదికల్లో ఏఈవోలకు లేదా మండలాల్లోని వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలి.
ఏయే పత్రాలు కావాలి..?
- పట్టాదారు పాస్ పుస్తకం
- రైతు ఆధార్ కార్డు
- బ్యాంకు అకౌంట్ పాస్ పుస్తకం
మూడు విడుతల్లో..
యాసంగి సీజన్ రైతుభరోసా నిధులను మూడు విడుతల్లో విడుదల చేయనున్నారు. మొదటి విడతగా ఈ నెల 22వ తేదీన సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి 70 లక్షల మంది రైతులకు ఎకరం వరకు రూ.3,590 కోట్లు నిధులను రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బదిలీ చేయనున్నారు.
తర్వాత మరో 20 రోజులకు రూ.2,650 కోట్లు రెండో విడతలో, ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా రూ.2,760 నిధులు రైతు భరోసా పంట పెట్టుబడి సాయాన్ని వారి ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. మొత్తంగా ఎకరానికి రూ.6 వేల చొప్పున 1.50 కోట్ల ఎకరాలకు రూ.9 వేల కోట్లు రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి.
కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు మూడు విడుతల్లో రైతుభరోసా అందించింది. ప్రస్తుతం నాలుగో సీజన్‌కు నిధులు అందుతున్నాయి. 2023-24 యాసంగిలో ఎకరానికి రూ.5000 చొప్పున 7625 కోట్లు, 2024-25 యాసంగిలో రూ.5000 చొప్పున రూ.5057 కోట్లు, 2025-26 వానాకాలం సీజన్‌లో ఎకరానికి సాయం రూ.6000కి పెంచి రూ.8800 కోట్లను జమ చేసింది.
ఇవికూడా చదవండి..
మార్కెట్ అవసరాలకు అనుగుణంగా.. డిగ్రీ, పీజీలో కొత్త కోర్సులు..
అప్పుడే జట్టులో చోటు లేదని తెలిసిపోయింది.. టెస్టు రిటైర్మెంట్‌పై అశ్విన్ కీలక కామెంట్స్..!
చావే అతనికి విముక్తి.. హరీష్ రాణా కన్నీటి కథ ఇది
మార్చి 18 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఊహించని మార్గాల్లో లాభాలు వచ్చే అవకాశం!
సంబంధిత వార్తలు

Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య
ఆగస్టు 25, 2026

Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి
ఆగస్టు 25, 2026

Graduates’ MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!
ఆగస్టు 25, 2026
తాజావార్తలు
- ●సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు
- ●Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య
- ●Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి
- ●Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?
- ●NSG | ఉగ్రవాదంపై సమరానికి మహిళా కమాండోలు..!
- ●Graduates' MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!

సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు

Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య

Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి

Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?



