Benjamin Netanyahu | నేను బతికే ఉన్నాను.. అమెరికా రాయబారితో ఇజ్రాయెల్ ప్రధాని ఆసక్తికర సంభాషణ
Benjamin Netanyahu | ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) చనిపోయారంటూ గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం (Death Rumours) జరుగుతోంది.
International | Published On Mar 18, 2026, 10.10 am IST
Benjamin Netanyahu | ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) చనిపోయారంటూ గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం (Death Rumours) జరుగుతోంది. అయితే తాను బతికే ఉన్నానని, ఎలాంటి దాడీ జరగలేదని నిరూపించుకునేందుకు నెతన్యాహు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఓ పలు వీడియోలు రిలీజ్ చేసిన నెతన్యాహు.. తాజాగా మరోసారి తాను బతికే ఉన్నానని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఈ సారి ఆయన ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబారి (US Envoy) మైక్ హకబీని కలిసిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఈ వీడియోలో హకబీ, నెతన్యాహు ఇద్దరూ మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా హకబీ మాట్లాడుతూ.. మీరు క్షేమంగా ఉన్నారో లేదో కనుక్కోవాలని డొనాల్డ్ ట్రంప్ నన్ను వ్యక్తిగతంగా ఇక్కడికి పంపారు అంటూ ఇజ్రాయెల్ ప్రధానితో అన్నారు. మిమ్మల్ని చూసినందుకు సంతోషంగా ఉంది అంటూ పేర్కొన్నారు. దీనికి నెతన్యాహు స్పందిస్తూ.. అవును మైక్ నేను బతికే ఉన్నాను అంటూ బదులిచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ సందర్భంగా అమెరికా రాయబారికి ఓ పంచ్ కార్డును చూపించారు నెతన్యాహు. ఇందులో ఉన్న ఇద్దరి పేర్లను చెరిపేశామని.. ఈ బ్యాచ్‌లో ఇంకా ఎంతమంది ఉన్నారో చూడండి అంటూ పేర్కొన్నారు. అందులో ఉన్న వారిని తుడిచిపెట్టేస్తున్నాం అంటూ ఇరాన్‌పై తన వైఖరిని స్పష్టం చేశారు. నెతన్యాహు పంచ్ కార్డుకు హకబీ స్పందిస్తూ.. ఇందులో నాపేరు లేకపోవడం మంచి విషయం అంటూ చమత్కరించారు. దీనికి నెతన్యాహు నవ్వుతూ.. మీరు మంచి వాళ్ల లిస్ట్‌లో ఉన్నారు అంటూ బదులిచ్చారు.
https://x.com/netanyahu/status/2033938254831956091
Also Read..
LPG Cylinder | తాళం వేసిన ఉన్న ఇంట్లో.. నగలతోపాటు గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లిన దొంగ
Rythu Bharosa | కొత్త వారికీ రైతుభరోసా.. ప్రారంభమైన దరఖాస్తులు.. ఏయే పత్రాలు ఉండాలంటే?
సంబంధిత వార్తలు

Israel Gaza War | గాజాపై ట్రంప్ ‘పీస్ ప్లాన్’కు ఇజ్రాయెల్ బ్రేక్: హమాస్ పూర్తిగా ఆయుధాలు వీడేదాకా వెనక్కి తగ్గేది లేదన్న నెతన్యాహు
ఆగస్టు 9, 2026

Donald Trump | ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర..? పెంటగాన్‌కు సమాచారం ఇచ్చిన ఇజ్రాయెల్
జులై 10, 2026

Donald Trump | మిత్రమా.. ఇది గొప్ప డీల్.. యుద్ధాన్ని ముగించే సమయం వచ్చింది
జూన్ 13, 2026
తాజావార్తలు
- ●Bandi Sanjay | ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు.. విదేశీ విద్యనందిస్తామంటే నమ్ముడెట్ల?
- ●Caste Census | కులగణనలో ఓపెన్ ఎండెడ్ విధానం వద్దు.. ప్రధానికి రాహుల్, ఖర్గే లేఖ
- ●V Srinivas Goud | ఇండెంట్ పెట్టకుండ ఉత్తమ్ ఏం చేస్తున్నడు?
- ●Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ - అధ్యక్ష పదవికి పోటీ
- ●Mumbai Local Train Viral Video | ముంబై లోకల్ ట్రైన్ షాకింగ్ వీడియో: ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట వేలాడుతున్న మహిళలు
- ●Harish Rao | 22ఏ భూముల వ్యవహారంలో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 పొంగులేటి

Bandi Sanjay | ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు.. విదేశీ విద్యనందిస్తామంటే నమ్ముడెట్ల?

Caste Census | కులగణనలో ఓపెన్ ఎండెడ్ విధానం వద్దు.. ప్రధానికి రాహుల్, ఖర్గే లేఖ

V Srinivas Goud | ఇండెంట్ పెట్టకుండ ఉత్తమ్ ఏం చేస్తున్నడు?

Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ - అధ్యక్ష పదవికి పోటీ



