Isfahan | ఇరాన్‌పై అమెరికా భీకర దాడి.. ఇస్‌ఫాహన్ నగరంపై బంకర్ బస్టర్లను జారవిడిచిన యూఎస్
Isfahan | ఇరాన్ (Iran)పై అమెరికా దాడులను పెంచింది. తాజాగా టెహ్రాన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఇస్‌ఫాహన్‌పై (Isfahan) బాంబులతో విరుచుకుపడింది. దాదాపు రెండు వేల పౌండ్ల బరువున్న అంటే సుమారు 907 కేజీల బరువున్న బంకర్ బస్టర్ బాంబులతో (Bunker Buster Bomb) విరుచుపడింది.
International | Published On Mar 31, 2026, 1.01 pm IST
Isfahan | ఇరాన్ (Iran)పై అమెరికా దాడులను పెంచింది. తాజాగా టెహ్రాన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఇస్‌ఫాహన్‌పై (Isfahan) బాంబులతో విరుచుకుపడింది. దాదాపు రెండు వేల పౌండ్ల బరువున్న అంటే సుమారు 907 కేజీల బరువున్న బంకర్ బస్టర్ బాంబులతో (Bunker Buster Bomb) విరుచుపడింది. మంగళవారం తెల్లవారుజామున ఈ దాడి చేసింది. దాడికి సంబంధించిన వీడియోని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్వయంగా తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్టు చేశారు. అయితే, ఈ వీడియోకు సంబంధించి ట్రంప్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
ఆ నగరంలో సుమారు 23 లక్షల జనాభా ఉంటుంది. బదర్ సైనిక వైమానిక స్థావరం కూడా ఇక్కడే ఉంది. ఈ నగరంలో ఇరాన్ భారీగా పేలుడు పదార్థాలను దాచినట్లు అంతర్జాతీయ మీడియా నివేదిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రధాన ఆయుధ డిపోపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు జరిపినట్లు తెలిపింది. అత్యంత శక్తిమంతమైన బాంబులను జార విడిచినట్లు వెల్లడించింది. ఇక యూఎస్ దాడులతో ఇస్‌ఫాహన్ నగరం భారీ శబ్దాలతో దద్దరిల్లింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల కారణంగా వెలువడిన పొగ ఏకంగా ఆకాశాన్ని తాకింది.
ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన యురేనియం ఉన్నవిషయం తెలిసిందే. దాన్ని ఈ నగరానికి తరలించినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అక్కడ అండర్‌గ్రౌండ్‌లో ఈ శుద్దీకరించిన యురేనియంను ఇరాన్ దాచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ నగరంపై అమెరికా శక్తిమంతమైన దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. యూఎస్ దాడులతో ఆ ప్రాంతం మొత్తం కంపించినట్లు స్థానిక మీడియా తెలిపింది.
Also Read..
హర్మూజ్‌ను తెరవకపోయినా.. యుద్ధాన్ని ఆపేస్తాం : డొనాల్డ్ ట్రంప్
జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరుడు మృతి..!
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గిందా..?
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






