Masood Azhar | జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరుడు మృతి..!
Masood Azhar | నిషేధిత ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ చీఫ్ (Jaish chief) మౌలానా మసూద్ అజార్ (Maulana Masood Azhar) సోదరుడు మొహమ్మద్ తాహిర్ అన్వర్ (Mohammad Tahir Anwar) మృతిచెందాడు.
International | Published On Mar 31, 2026, 12.42 pm IST
Masood Azhar | నిషేధిత ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ చీఫ్ (Jaish chief) మౌలానా మసూద్ అజార్ (Maulana Masood Azhar) సోదరుడు మొహమ్మద్ తాహిర్ అన్వర్ (Mohammad Tahir Anwar) మృతిచెందాడు. పాకిస్థాన్ (Pakistan)లో అనుమానాస్పద రీతిలో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు. బహావల్‌పూర్ (Bahawalpur) లోని జామియా మసీదు ఉస్మాన్ వాలిలో అన్వర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మహమ్మద్ తాహిర్ జైషే కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడు.
కాగా, జైషే చీఫ్ మసూద్ అజార్ గతేడాది కూడా దాదాపు పది మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా బహావల్‌పూర్‌లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంపై మన సైన్యం చేసిన దాడుల్లో అజార్‌కు అత్యంత సన్నిహితులైన పలువురు బంధువులు చనిపోయారు. అజార్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలుతో పాటు పలువురు కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోయారు. గతేడాది సెప్టెంబర్‌లో జైష్ సంస్థ మొదటిసారిగా ఈ నష్టాలను పరోక్షంగా అంగీకరించింది కూడా.
ఇక భారత్‌లో జరిగిన అనేక ఉగ్ర దాడులకు ఈ జైషే సంస్థకు సంబంధం ఉన్న విషయం తెలిసిందే. 2001 పార్లమెంట్‌పై దాడి, 2008 ముంబై దాడులు, 2016 పఠాన్‌కోట్ దాడి, 2019 పుల్వామా దాడిలో మసూద్ నిందితుడిగా ఉన్నాడు. ఇక మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read..
హర్మూజ్‌ను తెరవకపోయినా.. యుద్ధాన్ని ఆపేస్తాం : డొనాల్డ్ ట్రంప్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Upendra Dwivedi | ప్రపంచ పటంలో ఉండాలో లేదో వారే నిర్ణయించుకోవాలి.. పాక్‌కు ఆర్మీచీఫ్ వార్నింగ్
మే 16, 2026

KTR | లోక్‌సభలో బీఆర్ఎస్ సభ్యులుంటే తేజస్వి సూర్యతో క్షమాపణ చెప్పించేవాళ్లం : కేటీఆర్
ఏప్రిల్ 27, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



