త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | స్వ‌ల్పంగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. పెట్టుబ‌డిదారుల ఆస‌క్తి త‌గ్గిందా..?

Gold And Silver Prices Today | మ‌ధ్య‌ప్రాచ్యంలో యుద్ధం ముగిసే ప‌రిస్థితులు లేక‌పోయినా బంగారం, వెండి ధ‌ర‌ల్లో మాత్రం భారీ పెరుగుద‌ల క‌నిపించ‌డం లేదు. పెట్టుబ‌డిదారులు ఈ లోహాల‌ను కొనుగోలు చేసేందుకు లేదా పెట్టుబ‌డులు పెట్టేందుకు అంత‌గా ఆస‌క్తిని చూపించ‌డం లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

S

Business | Published On Mar 31, 2026, 11.32 am IST

Gold And Silver Prices Today | స్వ‌ల్పంగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. పెట్టుబ‌డిదారుల ఆస‌క్తి త‌గ్గిందా..?
Advertisement

Gold And Silver Prices Today | మ‌ధ్య‌ప్రాచ్యంలో యుద్ధం ముగిసే ప‌రిస్థితులు లేక‌పోయినా బంగారం, వెండి ధ‌ర‌ల్లో మాత్రం భారీ పెరుగుద‌ల క‌నిపించ‌డం లేదు. పెట్టుబ‌డిదారులు ఈ లోహాల‌ను కొనుగోలు చేసేందుకు లేదా పెట్టుబ‌డులు పెట్టేందుకు అంత‌గా ఆస‌క్తిని చూపించ‌డం లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. యుద్ధానికి ముందే వీటి ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డంతో ప్ర‌స్తుతం పెట్టుబ‌డిదారులు లాభాల బుకింగ్‌కు చూస్తున్నారు. అందువ‌ల్ల స్వ‌ల్పంగా పెరుగుద‌ల వ‌స్తే త‌రువాతి సెష‌న్ల‌లో ధ‌ర‌లు త‌గ్గుతున్నాయి. ఈ క్ర‌మంలోనే గ‌త కొద్ది రోజులుగా బంగారం, వెండి మార్కెట్ల‌లో అనిశ్చితి నెల‌కొంది. ఇక మంగ‌ళ‌వారం మ‌హావీర్ జ‌యంతి సంద‌ర్భంగా దేశీయ ఈక్విటీ, క‌మోడిటీ మార్కెట్ల‌కు సెల‌వు కాగా క్రితం సెష‌న్ ముగింపులో ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్‌ కాంట్రాక్టు 3,384 పాయింట్లు (2.35 శాతం) పెరిగి 1,47,666 వ‌ద్ద ముగిసింది. అలాగే సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1,007 పాయింట్లు (0.44 శాతం) పెరిగి 2,28,961 వ‌ద్ద స్థిర ప‌డింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో మంగ‌ళ‌వారం బంగారం ధ‌ర ఔన్స్‌కు 68 డాల‌ర్ల‌కు పైగా పెరిగి 4,580 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు పెర‌గ్గా, వెండి ధ‌ర‌ల్లో స్వ‌ల్ప పెరుగుద‌ల చోటు చేసుకుంది.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,929 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,19,432గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,49,290గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,92,900 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.10,300 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,685 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,09,480గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,36,850 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,68,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.9,500 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,197 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.89,576గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,11,970 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,19,700గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7,800 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,50,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే కేజీకి రూ.5వేలు పెరిగింది. అయితే హైద‌రాబాద్ మార్కెట్‌లో మాత్రం వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు. హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,50,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,500గా ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement