త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | హ‌ర్మూజ్‌ను తెర‌వ‌క‌పోయినా.. యుద్ధాన్ని ఆపేస్తాం : డొనాల్డ్ ట్రంప్‌

Donald Trump | ఇరాన్ యుద్ధం (Iran war) మొద‌లై నెల రోజులు పూర్తైంది. ఈ నేప‌థ్యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హ‌ర్మూజ్ జ‌ల‌సంధి (Strait of Hormuz)ని ఇరాన్ తెర‌వ‌కున్నా.. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' (Operation Epic Fury) పేరుతో ఆ దేశంపై చేప‌ట్టిన యుద్ధాన్ని ముగించేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్లు ట్రంప్ త‌న స‌హ‌చ‌రుల‌తో వెల్ల‌డించార‌ట‌.

D

International | Published On Mar 31, 2026, 12.24 pm IST

Donald Trump | హ‌ర్మూజ్‌ను తెర‌వ‌క‌పోయినా.. యుద్ధాన్ని ఆపేస్తాం : డొనాల్డ్ ట్రంప్‌
Advertisement

Donald Trump | ఇరాన్ యుద్ధం (Iran war) మొద‌లై నెల రోజులు పూర్తైంది. ఈ నేప‌థ్యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హ‌ర్మూజ్ జ‌ల‌సంధి (Strait of Hormuz)ని ఇరాన్ తెర‌వ‌కున్నా.. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' (Operation Epic Fury) పేరుతో ఆ దేశంపై చేప‌ట్టిన యుద్ధాన్ని ముగించేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్లు ట్రంప్ త‌న స‌హ‌చ‌రుల‌తో వెల్ల‌డించార‌ట‌. ఈ విష‌యాన్ని ఉన్న‌తాధికారుల‌ను ఉటంకిస్తూ ది వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ నివేదించింది. ఆ జలసంధిని తిరిగి తెరిచేందుకు సైనిక చర్యను ప్రారంభించాలా..? వద్దా..? అనే నిర్ణయాన్ని తర్వాత తీసుకోవచ్చని ట్రంప్ తెలిపార‌ట‌. ప్రస్తుతానికి అది తక్షణ ప్రాధాన్యత కాదని ట్రంప్ త‌న స‌హ‌చ‌రుల‌తో చెప్పిన‌ట్లు స‌ద‌రు నివేదిక పేర్కొంది. ఉన్న‌తాధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశార‌ట‌.

ఆ నివేదిక ప్ర‌కారం.. ఇరాన్‌పై ఆప‌రేష‌న్‌ను కేవ‌లం నాలుగు నుంచి ఆరు వారాల వ‌ర‌కు మాత్ర‌మే అంచ‌నా వేసి అమెరికా దాడులకు దిగింది. ఒక‌వేళ జ‌ల‌సంధి అంశంలో సందిగ్ధ‌త కొన‌సాగితే యుద్ధం ముగింపు మ‌రింత ఆల‌స్యం అవుతుంద‌ని ట్రంప్, ఆయ‌న స‌హాయ‌కులు భావిస్తున్నారు. అందుకే అమెరికా త‌న అస‌లు ల‌క్ష్యంపై దృష్టి సారించాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇందులో భాగంగానే ఇరాన్ నేవీని దెబ్బ‌తీయ‌డం, క్షిప‌ణి నిల్వ‌ల‌ను పేధ్వంసం చేయ‌డం లాంటి నిర్ణ‌యాల‌ను వేగ‌వంతం చేయాల‌ని ట్రంప్ భావిస్తున్న‌ట్లు స‌ద‌రు నివేదిక వెల్ల‌డించింది. ఆపై దౌత్య‌ప‌రంగా ఒత్తిడి తెస్తూ యుద్ధాన్ని ముగించి వాణిజ్య మార్గాల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని ట్రంప్ భావిస్తున్నార‌ట‌.

మ‌రోవైపు వైట్‌హౌస్ ప్రెస్ సెక్ర‌ట‌రీ క‌రోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. హ‌ర్మూజ్ జ‌ల‌సంధి ద్వారా చ‌మురు ట్యాంక‌ర్ల సుర‌క్షిత ప్ర‌యాణాన్ని నిర్ధారించ‌డం అనేది ఇరాన్‌పై సైనిక చ‌ర్య‌ను ముగించ‌డానికి ట్రంప్ నిర్దేశించిన ప్ర‌ధాన ల‌క్ష్యాల్లో ఒక‌టి కాద‌ని అన్నారు. ఇక అమెరికా సైనిక చ‌ర్య ముగిసిన త‌ర్వాత ఈ జ‌ల‌సంధి ఏదో ఒక విధంగా తిరిగి తెరుచుకుంటుంద‌ని యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రుబియో అల్ జ‌జీరాకు తెలిపారు.

Also Read..

ఆదిమ కృష్ణబిలం చిక్కింది..! జాడ పట్టేసిన లైగో..! శాస్త్రవేత్తలు ఏమన్నారంటే..!

ట్యాంక్‌బండ్‌పై రూ. 4 కోట్ల‌తో పూలే దంప‌తుల విగ్ర‌హాలు: పొన్నం

హైదరాబాద్‌లో ఉన్న జయలలిత ఇల్లు సీజ్

Advertisement

తాజావార్తలు

Advertisement