త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US Space Force | అంతరిక్షంలోనూ మా ఆయుధాలు ఉన్నాయ్‌.. అమెరికా బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌

US Space Force | త్రినేత్ర‌.న్యూస్ : అంతరిక్షంలో ఆయుధాలను మోహరించినట్లు (Orbit Weapon In Space) అగ్ర‌రాజ్యం అమెరికా తొలిసారి బ‌హిరంగంగా అంగీకరించింది.

D

International | Published On Sep 15, 2026, 1.40 pm IST

US Space Force | అంతరిక్షంలోనూ మా ఆయుధాలు ఉన్నాయ్‌.. అమెరికా బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌
Advertisement

US Space Force | త్రినేత్ర‌.న్యూస్ : అంతరిక్షంలో ఆయుధాలను మోహరించినట్లు (Orbit Weapon In Space) అగ్ర‌రాజ్యం అమెరికా తొలిసారి బ‌హిరంగంగా అంగీకరించింది. మేరీల్యాండ్‌లోని నేషనల్ హార్బర్‌లో జరిగిన ఎయిర్‌, స్పేస్‌, సైబర్‌ కాన్ఫరెన్స్‌లో అమెరికా స్పేస్‌ ఫోర్స్‌ (US Space Force) సెక్రటరీ ట్రాయ్‌ మెయింక్‌ (Troy Meink) ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. "శత్రు దేశాల దురాక్రమణ చర్యల నుంచి సంయుక్త బలగాలను రక్షించగల కక్ష్యలోని స్పేస్ కంట్రోల్ ఆయుధాలు అమెరికా వద్ద ఉన్నాయి" అని తెలిపారు.

శత్రు దేశాల నుంచి ఎదురయ్యే బెదిరింపుల నేపథ్యంలో అమెరికా, దాని మిత్ర దేశాలను సమర్థంగా రక్షించేందుకు కక్ష్యలోని ఈ ఆయుధాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అయితే ఏ రకమైన ఆయుధాలు, వాటి సామర్థ్యం ఏమిటన్న నిర్దిష్ట వివరాలను ఆయ‌న‌ వెల్లడించలేదు. ఈ ఆయుధాలు కైనెటిక్‌, నాన్‌-కైనెటిక్ విధానాల్లో పనిచేయగలవని మాత్రం తెలిపారు.

అంతరిక్ష రంగంలో చైనా, రష్యాల నుంచి ముప్పు పెరుగుతోందని అమెరికా భావిస్తోంది. చైనా ఇప్పటికే తన సైనిక ఆధునికీకరణలో భాగంగా స్పేస్‌, కౌంటర్‌ స్పేస్‌ వ్యవస్థలకు ప్రాధాన్యం ఇస్తోందని అమెరికా చెబుతోంది. మరోవైపు రష్యా కూడా అంతరిక్షాన్ని ఒక యుద్ధరంగంగా పరిగణిస్తోంది. భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో అంతరిక్ష ఆధిపత్యం కీలకంగా మార‌బోతోంది. ఉపగ్రహాలు సైనిక కమ్యూనికేషన్లు, నిఘా, నావిగేషన్‌కు కీలకం కావడంతో వాటిపై ఆధిపత్యం భవిష్యత్‌ యుద్ధాల్లో కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో అమెరికా తొలిసారి కక్ష్యలో ఆయుధాల ఉనికిని బహిరంగంగా అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కొత్త మలుపు తిరుగుతున్న అంతరిక్ష యుద్ధ రంగం

అంతరిక్షంలో ఆయుధాల మోహరింపునకు సంబంధించిన వ్యూహాలు ప్రచ్ఛన్న యుద్ధం కాలం నుంచే రూపుదిద్దుకున్నాయి. 1957లో సోవియట్ యూనియన్ మొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1ను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వెంటనే.. వాషింగ్టన్, మాస్కో దేశాలు ఉపగ్రహాలను ఆయుధీకరించే, ధ్వంసం చేసే మార్గాలను అన్వేషించడం ప్రారంభించాయి. దీంతో అంత‌రిక్షంలో అణ్వాయుధాల మోహ‌రింపుపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. ఈ నేపథ్యంలో 1967లో ఔటర్‌ స్పేస్‌ ట్రీటీ అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్ర‌కారం.. అంతరిక్షంలో సామూహిక జనహనన ఆయుధాలను మోహరించడంపై నిషేధం ఉంది. అప్ప‌టి నుంచి అమెరికా, రష్యా, చైనా, భార‌త్ వంటి ప్ర‌పంచ శ‌క్తులు ఆ ఒప్పంద ప‌రిధికి వెలుప‌ల సామ‌ర్థ్యాల‌ను అభివృద్ధి చేసేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. సైనిక స‌మాచార వ్య‌వ‌స్థ‌లు, నిఘా, నావిగేష‌న్‌కు అత్యంత కీల‌క‌మైన ప్ర‌త్య‌ర్థుల ఉప‌గ్ర‌హాల‌ను ల‌క్ష్యంగా చేసుకునే మార్గాల‌పై ఆయా దేశాలు దృష్టి సారించాయి.

Also Read..

పేలిన ఫ్రిడ్జ్‌.. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు మృతి

ఎంఎస్ సుబ్బుల‌క్ష్మి బ‌యోపిక్ అనౌన్స్ - నాలుగోసారి విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా ర‌ష్మిక‌?

తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు రండి.. ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vను కోరిన సీఎం రేవంత్

Advertisement
Advertisement