త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Refrigerator Explodes | పేలిన ఫ్రిడ్జ్‌.. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు మృతి

Refrigerator Explodes | క‌ర్ణాట‌క (Karnataka) బెళ‌గావి (Belagavi)లో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఫ్రిడ్జ్ పేలి (refrigerator explodes) ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు మ‌ర‌ణించారు.

D

National | Published On Sep 15, 2026, 12.40 pm IST

Refrigerator Explodes | పేలిన ఫ్రిడ్జ్‌.. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు మృతి
Advertisement

Refrigerator Explodes | త్రినేత్ర‌.న్యూస్ : వినాయ‌క చ‌వితి వేళ‌ క‌ర్ణాట‌క (Karnataka) బెళ‌గావి (Belagavi)లో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఫ్రిడ్జ్ పేలి (refrigerator explodes) ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు మ‌ర‌ణించారు. మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

బెళ‌గావి పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గజానన్ డమోనే కుటుంబం గ‌ణేశ్ చ‌తుర్థి సంద‌ర్భంగా సెంట్రల్ బస్ స్టాండ్ సమీపంలోని చవట్ గల్లీలో ఉన్న తమ ఇంట్లో వినాయక విగ్రహాన్ని ఉంచింది. కుటుంబ స‌భ్యులంతా ఒక‌చోట చేరి గ‌ణ‌ప‌తి బ‌ప్పాకు పూజ‌లు చేశారు. రాత్రి భోజ‌నం త‌ర్వాత అంతా నిద్ర‌పోయారు. అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత ఇంట్లోని ఫ్రిడ్జ్ ఒక్క‌సారిగా భారీ శ‌బ్ధంతో పేలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి.

భారీ శ‌బ్ధం రావ‌డంతో ఇరుగుపొరుగు వాళ్లు హుటాహుటిన అక్క‌డికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గ‌జాన‌న్‌, ఆయ‌న కుమారుడు రోష‌న్‌ను ప్ర‌మాదం నుంచి కాపాడారు. అయితే, మంట‌ల తీవ్ర‌త‌కు గజానన్ డమోనే భార్య శారద డమోనే (45), సోద‌రి భారతి డమోనే (50), పిల్ల‌లు గంగ (25), ప్రియ (24) అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్ర‌మాదం నుంచి గ‌జాన‌న్‌, ఆయ‌న కుమారుడు 60 శాతం కాలిన గాయాల‌తో ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపడుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగి ఉండొచ్చ‌ని అనుమానిస్తున్నారు.

Also Read..

న్యాయవ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శలకు అతీతం కాదు : సీజేఐ సూర్య‌కాంత్‌

ఎంఎస్ సుబ్బుల‌క్ష్మి బ‌యోపిక్ అనౌన్స్ - నాలుగోసారి విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా ర‌ష్మిక‌?

గ్లోబల్ విలేజ్ 31వ సీజన్.. అక్టోబర్ 14 నుంచి సందడి..

Advertisement
Advertisement