Revanth meets Prince Rahim Aga khan-V | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రండి.. ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vను కోరిన సీఎం రేవంత్
Revanth meets Prince Rahim Aga khan-V | వచ్చే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు తప్పకుండా రావాలని ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vను సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. ఈమేరకు మంగళవారం హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆయనతో సీఎం భేటీ అయ్యారు.
Revanth meets Prince Rahim Aga khan-V | త్రినేత్ర.న్యూస్: వచ్చే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు తప్పకుండా రావాలని ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vను సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. ఈమేరకు మంగళవారం హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆయనతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 100కు పైగా దేశాల ప్రతినిధులు ఈ సమ్మిట్‌కు హాజరవుతారన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణలో అగా ఖాన్ ఫౌండేషన్ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
అగాఖాన్ ఫౌండేషన్‌పై మాకు అత్యంత గౌరవం ఉంది. మా వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో అగాఖాన్ ఫౌండేషన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఫౌండేషన్ సహకారంతో ఇటీవలే మా శాసనమండలి భవనాన్ని, కుతుబ్ షాహీ టూంబ్స్‌ను పునరుద్ధరించుకున్నాం.
మూసీ నదితో నైట్ ఎకానమీ..
మూసీ నది పునరుజ్జీవం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణలో అగాఖాన్ ఫౌండేషన్ సహకారాన్ని కోరుతున్నాం. ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్‌లో నూతన భవనాన్ని నిర్మిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వారసత్వ సంపదగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. మూసీ నదిని నైట్ ఎకానమీ కోసం తీర్చిదిద్దుతాం.
15 వేల ఎకరాల్లో గ్రీన్ జోన్..
2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. నెట్-జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ ఉండబోతుంది. ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాల దూరంలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. సింగపూర్‌కు చెందిన కంపెనీ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తోంది. ఫ్యూచర్ సిటీలో 15 వేల ఎకరాల్లో గ్రీన్ జోన్ ఏర్పాటు చేస్తున్నాం. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ లాంటి సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయి అని రేవంత్‌రెడ్డి ప్రిన్స్ రహీమ్ అగాఖాన్-Vకు వివరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ramchandar Rao | విమోచన సత్యాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరవరు: రాంచందర్‌రావు
సెప్టెంబర్ 15, 2026

Kishan Reddy | తెలంగాణ విమోచన వేడుకలు జరిపేందుకు భయపడుతున్న కాంగ్రెస్, బీజేపీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సెప్టెంబర్ 15, 2026

KTR | తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా పనిచేస్తున్న పోలీసు శాఖ: కేటీఆర్
సెప్టెంబర్ 15, 2026
తాజావార్తలు
- ●Bajaj Holdings | బజాజ్ హోల్డింగ్స్ భారీ డివిడెండ్.. ఒక్కో షేరుకు రూ.65..
- ●US Space Force | అంతరిక్షంలోనూ మా ఆయుధాలు ఉన్నాయ్.. అమెరికా బహిరంగ ప్రకటన
- ●Samsung Galaxy S26 FE | గెలాక్సీ ఎస్26 ఎఫ్ఈ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్..
- ●AI Safety Risks | ఇక నావల్ల కాదు.. వచ్చే ఐదేళ్లలో ఏఐతో పెను విపత్తు రాబోతోందంటూ గూగుల్ డీప్‌మైండ్ రీసెర్చర్ రాజీనామా
- ●Ramchandar Rao | విమోచన సత్యాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరవరు: రాంచందర్‌రావు
- ●NYC Subway Accident | విషాదం.. రైల్వే ట్రాక్‌పై కూర్చుని ప్రాణాలు పోగొట్టుకున్న జంట : VIDEO

Bajaj Holdings | బజాజ్ హోల్డింగ్స్ భారీ డివిడెండ్.. ఒక్కో షేరుకు రూ.65..

US Space Force | అంతరిక్షంలోనూ మా ఆయుధాలు ఉన్నాయ్.. అమెరికా బహిరంగ ప్రకటన

Samsung Galaxy S26 FE | గెలాక్సీ ఎస్26 ఎఫ్ఈ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్..

AI Safety Risks | ఇక నావల్ల కాదు.. వచ్చే ఐదేళ్లలో ఏఐతో పెను విపత్తు రాబోతోందంటూ గూగుల్ డీప్‌మైండ్ రీసెర్చర్ రాజీనామా






















