Rashmika Mandanna | ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ అనౌన్స్ – నాలుగోసారి విజయ్ దేవరకొండకు జోడీగా రష్మిక?
ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సెప్టెంబర్ 16న చెన్నైలో జరుగనున్న ఈ బయోపిక్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్‌కు కమల్‌హాసన్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకాబోతున్నారు.
Entertainment | Published On Sep 15, 2026, 12.20 pm IST
Rashmika Mandanna | భారతరత్న అవార్డు గ్రహీత, దిగ్గజ సంగీత కళాకారిణి ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా తెలుగులో ఓ మూవీ రాబోతుంది. ఈ బయోపిక్‌ను మేకర్స్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ వివరాలతో పాటు చీఫ్ గెస్ట్ పేరును రివీల్ చేశారు.
101వ జయంతి...
సుబ్బులక్ష్మి 101వ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 16 బుధవారం చెన్నైలో ఈ బయోపిక్ లాంఛ్ కాబోతుంది. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు విలక్షణ నటుడు కమల్‌హాసన్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకాబోతున్నారు. ఈ వేడుకలో తమిళం, తెలుగు భాషలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నారు. ఈ బయోపిక్‌లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించబోతున్నట్లు వెల్లడించారు. సుబ్బులక్ష్మి అమ్మగా రష్మిక నటించనుందని పేర్కొన్నారు. ఈ పాత్ర పేరు ఆధారంగానే ఈ సినిమాకు సుబ్బులక్ష్మి అమ్మ అనే టైటిల్ ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నారు.
జెర్సీ ఫేమ్...
ఈ సినిమాకు జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. అల్లు అరవింద్, బన్నీవాస్, రాకల్‌లైన్ వెంకటేష్ సంయుక్తంగా ఈ బయోపిక్‌ను నిర్మించబోతున్నారు. రష్మిక మందన్నతో పాటు దక్షిణాది భాషలకు చెందిన పలువురు టాప్ స్టార్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం.
విజయ్ దేవరకొండ...
సుబ్బులక్ష్మి బయోపిక్‌లో హీరో ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సుబ్బులక్ష్మి భర్త కల్కి సదాశివన్ నిర్మాతగా కొన్ని సినిమాలు చేశారు. ఫ్రీడమ్ ఫైటర్‌గా భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు సంగీత సామ్రాజ్ఞిగా సుబ్బులక్ష్మి ఎదగడంలో సదాశివన్ పాత్ర ఎంతో ఉంది. వారిద్దరి ప్రేమకథ, వైవాహిక జీవితాన్ని ఈ బయోపిక్‌లో చూపించబోతున్నట్లు సమాచారం. సదాశివన్ పాత్ర కోసం పలువురు పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న హీరోల పేర్లను పరిశలిస్తున్నట్లు తెలిసింది. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ రేసులో ముందున్నట్లు సమాచారం. దాదాపు విజయ్ దేవరకొండ ఫైనల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్. విజయ్, రష్మిక రియల్ లైఫ్‌లో భార్యాభర్తలు కావడం, వీరిద్దరి జోడీకి ఉన్న క్రేజ్ ఈ బయోపిక్ హెల్పయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. త్వరలోనే హీరో పేరును అఫీషియల్‌గా మేకర్స్ ప్రకటించబోతున్నట్లు సమాచారం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ramya Krishnan | కమల రెడ్డిగా శివగామి – మంచు మనోజ్ సినిమాలో పవర్ఫుల్ రోల్
సెప్టెంబర్ 15, 2026

Bold OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి తెలుగు అడల్ట్ కామెడీ మూవీ – డబుల్ మీనింగ్ డైలాగ్స్, బోల్డ్ సీన్స్ ఎక్కువే!
సెప్టెంబర్ 15, 2026

Samantha | సమంత సీమంతం ఫొటోలు – హాజరైన అతిథులు ఎవరంటే?
సెప్టెంబర్ 15, 2026
తాజావార్తలు
- ●Vanteru Prathap Reddy | రేవంత్! నిన్ను ఏ భాషలో ప్రశ్నించమంటవ్
- ●Doctor Suicide | కరీంనగర్లో డాక్టర్ ఆత్మహత్య
- ●BRICS తర్వాత భారత్‌కు ప్రశంసలు ఎందుకు? న్యూఢిల్లీ దౌత్యం వెనుక అసలు లెక్క ఇదే
- ●Balapur Ganesh | రూ. 40 లక్షల వ్యయంతో బాలాపూర్ గణేశ్ మండపం ఏర్పాటు.. ప్రత్యేకత ఏంటంటే..?
- ●Ramya Krishnan | కమల రెడ్డిగా శివగామి - మంచు మనోజ్ సినిమాలో పవర్ఫుల్ రోల్
- ●Supreme Court | సుప్రీంలో హైడ్రాకు భారీ షాక్.. ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత

Vanteru Prathap Reddy | రేవంత్! నిన్ను ఏ భాషలో ప్రశ్నించమంటవ్

Doctor Suicide | కరీంనగర్లో డాక్టర్ ఆత్మహత్య

BRICS తర్వాత భారత్‌కు ప్రశంసలు ఎందుకు? న్యూఢిల్లీ దౌత్యం వెనుక అసలు లెక్క ఇదే

Balapur Ganesh | రూ. 40 లక్షల వ్యయంతో బాలాపూర్ గణేశ్ మండపం ఏర్పాటు.. ప్రత్యేకత ఏంటంటే..?



