త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sinkhole | అమెరికాలో సింక్‌హోల్‌.. గొయ్యిలో ప‌డిపోయిన రెండు వాహ‌నాలు.. షాకింగ్ వీడియో

Sinkhole | అమెరికా (America)లోని నెబ్రాస్కాలోని (Nebraska) ఓ సిగ్న‌ల్ వ‌ద్ద‌ రోడ్డు అక‌స్మాత్తుగా కుంగిపోయింది. దీంతో సిగ్న‌ల్ వ‌ద్ద ఆగి ఉన్న రెండు కార్లు ఆ గుంతలోకి ప‌డిపోయాయి (vehicles fell into a sinkhole).

D

International | Published On Feb 26, 2026, 2.46 pm IST

Sinkhole | అమెరికాలో సింక్‌హోల్‌.. గొయ్యిలో ప‌డిపోయిన రెండు వాహ‌నాలు.. షాకింగ్ వీడియో
Advertisement

Sinkhole | ఇటీవ‌లే చైనాలోని షాంఘై నగరంలో భారీ సింక్‌హోల్ (Sinkhole) ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా అమెరికా (America)లోనూ అలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. అమెరికాలోని నెబ్రాస్కాలోని (Nebraska) ఓ సిగ్న‌ల్ వ‌ద్ద‌ రోడ్డు అక‌స్మాత్తుగా కుంగిపోయింది. దీంతో సిగ్న‌ల్ వ‌ద్ద ఆగి ఉన్న రెండు కార్లు ఆ గుంతలోకి ప‌డిపోయాయి (vehicles fell into a sinkhole).

అదృష్ట‌వ‌శాత్తూ డ్రైవ‌ర్ల‌కు ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు యూనివర్శిటీ ఆఫ్ నెబ్రాస్కా-ఒమాహా (University of Nebraska Omaha) పబ్లిక్ సేఫ్టీ సెక్యూరిటీ కెమెరాలో రికార్డ‌య్యాయి. ఆ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ఈ ఘ‌ట‌న‌తో ప్ర‌యాణికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. స‌మాచారం అందుకున్న అధికారులు వెంట‌నే అక్క‌డికి చేరుకొని ప‌రిశీలించారు. భూగ‌ర్భంలో వాట‌ర్ పైపు ప‌గ‌ల‌డం వ‌ల్లే రోడ్డు కుంగిపోయిన‌ట్లు గుర్తించారు.

https://x.com/DailyLoud/status/2026656461888045547

కాగా, 15 రోజుల క్రితం చైనా షాంఘైలోని మిన్‌హాంగ్ జిల్లాలో మెట్రో నిర్మాణం జరుగుతుండగా రోడ్డు కుంగిపోయిన విష‌యం తెలిసిందే. దీంతో అక్క‌డ భారీ గుంత ఏర్ప‌డింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఇంత పెద్ద గొయ్యి ఏర్పడటం స్థానికంగా కలకలం రేపింది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం సమీపంలో జరుగుతున్న 'జియామిన్ లైన్' (Jiamin Line) మెట్రో నిర్మాణ పనులేనని ప్రాథమిక విచారణలో తేలింది. మెట్రో పనుల వల్ల భూగర్భంలో నీరు లీక్ (Water Leakage) అవుతున్నట్లు అధికారులు గుర్తించారు.

Also Read..

Womb Transplant | మిరాకిల్‌.. పుట్టుక‌తోనే గ‌ర్భం లేదు.. కానీ పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన మ‌హిళ‌

ప్ర‌ధాని మోదీని స‌ర్‌ప్రైజ్ చేసిన ఇజ్రాయెల్ ప్ర‌ధాని

న‌టి ర‌న్యారావుకు మ‌రో షాక్‌.. రూ.102 కోట్ల గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఛార్జ్‌షీట్‌లో పేరు

Advertisement
Advertisement