Womb Transplant | మిరాకిల్.. పుట్టుకతోనే గర్భం లేదు.. కానీ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
Womb Transplant | యూకేకి చెందిన (UK Woman) గ్రేస్ బెల్ (Grace Bell) అనే మహిళకు పుట్టుకతోనే గర్భం లేదు. అయితే మరణించిన దాత నుంచి సేకరించిన గర్భాశయాన్ని అమర్చుకున్న (Womb Transplant) గ్రేస్.. ఇప్పుడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
International | Published On Feb 26, 2026, 1.22 pm IST
Womb Transplant | వైద్య చరిత్రలోనే ఇదో మిరాకిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే.. పుట్టుకతోనే గర్భంలేని ఓ మహిళ ఇప్పుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మరణించిన దాత నుంచి సేకరించిన గర్భాశయాన్ని అమర్చుకున్న (Womb Transplant) ఆ మహిళ బేబీకి జన్మినిచ్చి వార్తల్లో నిలిచింది.
యూకేకి చెందిన గ్రేస్ బెల్ (Grace Bell) అనే మహిళ MRKH సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో జన్మించింది. ఈ వ్యాధి కారణంగా ఆమెకు గర్భాశయం లేదు. సాధారణ అండాశయాలు మాత్రం ఉంటాయి. యూకేలో దాదాపు 5 వేల మంది మహళల్లో ఒకరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే, 16 ఏళ్ల వయసులో గ్రేస్ బెల్‌కు ఈ విషయం తెలిసింది. తాను ఎప్పటికీ తల్లిని కాలేనని తెలుసుకుంది. దీంతో తీవ్రంగా కుంగిపోయింది. కానీ, వైద్యులు ఆమెకు తల్లి అయ్యే అవకాశాన్ని కల్పించారు. మరణించిన దాత నుంచి గర్భాశయాన్ని సేకరించి ఆమెకు అమర్చారు.
జూన్ 2024లో ఆక్స్‌ఫర్డ్‌లోని చర్చిల్ ఆసుపత్రిలో సుమారు 10 గంటలు శ్రమించి ఆమెకు శస్త్రచికిత్స చేశారు వైద్యులు. అనంతరం లండన్‌లోని లిస్టర్ ఫెర్టిలిటీ క్లినిక్‌లో ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. వారి సహకారంతో ఐవీఎఫ్ పద్దతి ద్వారా గ్రేస్ బెల్ గర్భం దాల్చింది. గతేడాది డిసెంబర్‌లో లండన్‌లోని ఓ ఆసుపత్రిలో తన భర్త సమక్షంలో గ్రేస్ బెల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబు 3.09 కిలోల బరువుతో పూర్తి ఆరోగ్యంతో పుట్టాడు. జీవితంలో తల్లిని కాలేనని బాధపడిన గ్రేస్.. ఇప్పుడు చేతిలో బిడ్డను పట్టుకుని భావోద్వేగానికి గురైంది.
ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన వైద్యులు, కుటుంబ సభ్యులకు గ్రేస్ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు, తనకు గర్భాశయం దానం చేసిన దాత కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. క్రిస్మస్‌కు ముందు జన్మించిన ఆ చిన్నారికి 'హ్యూగో' అని పేరు పెట్టారు. గర్భాశయ వైకల్యంతో బాధపడే వేలాది మంది మహిళల్లో ఈ విజయం కొత్త ఆశలు చిగురింపజేసింది. మరోవైపు గర్భంలేని మహిళ పండంటి బిడ్డకు జన్మనివ్వడం యూకేలో ఇదే తొలిసారి (UK medical) అని తెలిసింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



