త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi in Israel | ప్ర‌ధాని మోదీని స‌ర్‌ప్రైజ్ చేసిన ఇజ్రాయెల్ ప్ర‌ధాని

PM Modi in Israel | భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)కి ఇజ్రాయెల్ ప్ర‌ధాని (Israeli Prime Minister) బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ఓ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు.

D

National | Published On Feb 26, 2026, 11.27 am IST

PM Modi in Israel | ప్ర‌ధాని మోదీని స‌ర్‌ప్రైజ్ చేసిన ఇజ్రాయెల్ ప్ర‌ధాని
Advertisement

PM Modi in Israel | భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఇజ్రాయెల్‌లో ప‌ర్య‌టిస్తున్న (PM Modi in Israel) విష‌యం తెలిసిందే. రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం జెరూస‌లెంలో ల్యాండ్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధానికి అక్క‌డ ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఇజ్రాయెల్ ప్ర‌ధాని (Israeli Prime Minister) బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ఎయిర్‌పోర్టులో మోదీకి స్వాగ‌తం ప‌లికారు. ఇక ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా త‌న ఫ్రెండ్ మోదీకి నెత‌న్యాహూ ఓ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు.

మోదీ కోసం ఇజ్రాయెల్ ప్ర‌ధాని ప్ర‌త్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఆ ప్రైవేట్‌ విందుకు ముందు నెత‌న్యాహు భార‌తీయ సంప్ర‌దాయ దుస్తులు (Indian attire) ధ‌రించి ప్ర‌ధాని మోదీని స‌ర్‌ప్రైజ్ చేశారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ నెత‌న్యాహు ఎక్స్‌లో ఫొటో షేర్ చేశారు. ఈ ట్వీట్‌కు ప్ర‌ధాని కూడా స్పందించారు. చాలా బాగుంది అంటూ కామెంట్ పెట్టారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో వైర‌ల్‌గా మారింది.

మోదీకి ‘స్పీకర్‌ ఆఫ్‌ ది కనెసెట్‌ మెడల్‌’

మ‌రోవైపు ప్ర‌ధాని మోదీని కనెసెట్‌ అందించే అత్యున్నత పురస్కారమం ‘స్పీకర్‌ ఆఫ్‌ ది కనెసెట్‌ మెడల్‌’తో ఇజ్రాయెల్ స‌త్క‌రించింది. భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేసినట్లు పార్లమెంటు తెలిపింది. ఇక ఈ మెడ‌ల్‌ను అందుకున్న తొలి నేత మోదీనే కావ‌డం విశేషం. ఇజ్రాయెల్, పాలస్తీనా.. రెండు దేశాల నుంచీ అత్యున్నత పురస్కారాలు అందుకున్న అరుదైన నేతగా మోదీ నిలిచారు. విదేశీ నేతలకు పాలస్తీనా ఇచ్చే అత్యున్నత పురస్కారమైన ‘గ్రాండ్‌ కాలర్‌ ఆఫ్‌ ది స్టేట్‌ ఆఫ్‌ పాలస్తీనా’ను 2018లో ఆయన స్వీకరించారు.

Advertisement
Advertisement