త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | ఆయుధాలు వీడ‌కుంటే మ‌ర‌ణ‌మే.. ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చ‌రిక‌లు

Donald Trump | ఇరాన్‌పై దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ధృవీక‌రించారు. ఆయుధాలు వ‌దిలేయ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. ఆ దేశ నాయ‌కులు మాట విన‌కుంటే మొత్తం దేశాన్ని నాశ‌నం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

D

International | Published On Feb 28, 2026, 2.49 pm IST

Donald Trump | ఆయుధాలు వీడ‌కుంటే మ‌ర‌ణ‌మే.. ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చ‌రిక‌లు
Advertisement

Donald Trump | ఇరాన్‌పై దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ధృవీక‌రించారు. ఇరాన్ త‌న అణు మౌలిక స‌దుపాయాల‌ను పున‌ర్మించ‌కుండా (Iran Nuclear Infrastructure) నిరోధించేందుకు దాడులు చేసిన‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు త‌న సొంత సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో వీడియో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా టెహ్రాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చ‌రిక‌లు చేశారు. ఆయుధాలు వ‌దిలేయ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. ఆ దేశ నాయ‌కులు మాట విన‌కుంటే మొత్తం దేశాన్ని నాశ‌నం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

"ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్, సాయుధ దళాలు, పోలీసులందరికీ చెప్తున్నా.. మీరు మీ ఆయుధాలను విడిచిపెట్టండి. మాట విన‌క‌పోతే మ‌ర‌ణ‌మే" అంటూ తీవ్రంగా హెచ్చ‌రించారు. "అమెరికా తన ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవాలని నిశ్చయించుకుంది. ఇరాన్ తన సొంత అణుబాంబులను తయారు చేసుకోకుండా అడ్డుకుంటాం. ఇరాన్ త‌న అణు మౌలిక స‌దుపాయాల‌ను పున‌ర్మించ‌డానికి, క్షిప‌ణుల‌ను అభివృద్ధి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అందుకే ఆ ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకునేందుకు ఆ దేశంపై భారీ సైనిక చ‌ర్య చేప‌ట్టాం. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయడమే లక్ష్యంగా దాడులు చేప‌ట్టాం. ఇక ఎప్ప‌టికీ ఇరాన్ అణ్వాయుధాల‌ను క‌లిగి ఉండ‌కుండా వాటిని పూర్తిగా నాశ‌నం చేస్తాం" అని ట్రంప్ హెచ్చ‌రించారు.

Also Read..

India releases advisory for citizens | ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. పౌరుల‌కు భార‌త్ కీల‌క అడ్వైజ‌రీ

Israel Strikes Iran | ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. ఖ‌మేనీ కార్యాల‌యం స‌మీపంలో పేలుళ్లు

Menaka Guruswamy | తొలిసారి రాజ్యసభకు LGBTQ కమ్యూనిటీ మహిళ.. ఎవ‌రీ మేనకా గురుస్వామి..?

Advertisement
Advertisement