Menaka Guruswamy | తొలిసారి రాజ్యసభకు LGBTQ కమ్యూనిటీ మహిళ.. ఎవరీ మేనకా గురుస్వామి..?
Menaka Guruswamy | రాజ్యసభ ఎన్నికలకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి (Menaka Guruswamy)ని తృణముల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆమె ఎగువసభలో అడుగుపెడితే పార్లమెంట్ చరిత్రలోనే తొలి LGBTQ పార్లమెంట్ సభ్యురాలుగా నిలువనున్నారు.
Menaka Guruswamy | రాజ్యసభ (Rajya Sabha) ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో నాలుగు స్థానాలకు అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్ర మంత్రి బాబుల్ సుప్రియో, బెంగాల్ మాజీ డీజీపీ రాజీవ్‌కుమార్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి (Menaka Guruswamy), నటి కోయల్ మల్లిక్‌ను అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ నలుగురు అభ్యర్థుల్లో మేనకా గురుస్వామి ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఎగువ సభకు ఎన్నికైతే మేనకా గురుస్వామి సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. పార్లమెంట్ చరిత్రలోనే తొలి LGBTQ పార్లమెంట్ సభ్యురాలుగా నిలువనున్నారు.
మేనకా గురుస్వామి తెలంగాణకు చెందినవారు. ఆమె ఆర్థిక రంగ నిపుణుడు మోహన్ గురుస్వామి, మీరా గురుస్వామిలకు 1974, నవంబర్ 27న హైదరాబాద్‌లో జన్మించారు. గురుస్వామి తన ప్రాథమిక విద్యను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పూర్తి చేశారు. న్యూఢిల్లీలోని సర్దార్ పటేల్ విద్యాలయంలో ఉన్నత పాఠశాలను పూర్తి చేశారు. ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా వర్సిటీ నుంచి బీఏఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. మోహన్ గురుస్వామి అనేక పత్రికల్లో వ్యాసాలు రాస్తుంటారు. తండ్రికి తగ్గ తనయగా మేనకా గురుస్వామి న్యాయవాద వృత్తిలో మంచి పేరు తెచ్చుకున్నారు.
తొలి ఎల్‌జీబీటీక్యూ ఎంపీగా..
2018లో స్వలింగ బంధాల (homosexuality) గురించి సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఆ బంధాలను నేరంగా చెప్పే ఐపీసీ సెక్షన్ 377ను కొట్టివేసింది. ఈ తీర్పు రావడానికి కీలక పాత్ర పోషించిన న్యాయవాదుల్లో మేనకా కూడా ఒకరు. ఈ కేసు వాదించిన గురుస్వామి కూడా ఎల్‌జీబీటీక్యూ (లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్ వంటి వర్గాలను తెలియజేసే పదం). ఇప్పుడు ఆమె రాజ్యసభకు ఎన్నికైతే.. పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించే తొలి ఎల్‌జీబీటీక్యూ ఎంపీగా రికార్డు సృష్టించనున్నారు. తెలంగాణ బిడ్డ బెంగాల్ గడ్డ నుంచి రాజ్యసభకు ఎన్నికవుతుండటంపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
మార్చి 16న ఎన్నికలు..
దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. ఎగువ సభ నుంచి మొత్తం 37 మంది సభ్యులు ఏప్రిల్‌లో రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆ స్థానాలకు ఎన్నికనలు నిర్వహించేందుకు ఈసీ ఇటీవలే షెడ్యూల్ ప్రకటించింది. మహారాష్ట్రలో ఏడుగురు, ఒడిశాలో నలుగురు , తమిళనాడులో ఆరుగురు, బెంగాల్‌లో ఐదుగురు, అస్సాంలో ముగ్గురు , బీహార్‌లో ఐదుగురు, చత్తీస్‌ఘడ్, హర్యానాల్లో ఇద్దరేసి, హిమాచల్ ప్రదేశ్‌లో ఒకరి సీటు కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణ నుంచి రెండు స్థానాలకు ఎన్నికలు చేపట్టనున్నారు. ఈ ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మార్చి 5న నామినేషన్లకు చివరి తేదీ. మార్చి 6న నామినేషన్ల పరిశీలన, 9వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు. మార్చి 16న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.
Also Read..
Israel Strikes Iran | ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. ఖమేనీ కార్యాలయం సమీపంలో పేలుళ్లు
HPV vaccination | దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
Virosh Wedding | పెళ్లి ఫొటోలతో చరిత్ర సృష్టించిన విరోష్ జోడీ.. కోహ్లీ రికార్డు కూడా బద్దలే
సంబంధిత వార్తలు

Mamata Banerjee | పార్టీని వీడాలనుకునేవారు స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చు : మమతా బెనర్జీ
మే 16, 2026

Mamata Banerjee | మరోసారి లాయర్ అవతారమెత్తిన మమతా బెనర్జీ.. కేసు వాదించేందుకు నల్లకోటు ధరించి కోర్టుకు వెళ్లిన దీదీ
మే 14, 2026

Suvendu Adhikari | నందిగ్రామ్‌ను వదులుకున్న సువేందు అధికారి.. దీదీ మరో నియోజకవర్గం చూసుకోక తప్పదా!
మే 14, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



