త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India releases advisory for citizens | ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. పౌరుల‌కు భార‌త్ కీల‌క అడ్వైజ‌రీ

India releases advisory for citizens | ఇరాన్ (Iran)పై ఇజ్రాయెల్ (Israel) భీక‌ర దాడులు మొద‌లు పెట్టింది. రాజ‌ధాని టెహ్రాన్‌పై క్షిప‌ణులు, డ్రోన్‌ల‌తో విరుచుకుప‌డింది. తాజా దాడుల‌తో భార‌త్ అప్ర‌మ‌త్త‌మైంది.

D

National | Published On Feb 28, 2026, 1.49 pm IST

India releases advisory for citizens | ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. పౌరుల‌కు భార‌త్ కీల‌క అడ్వైజ‌రీ
Advertisement

India releases advisory for citizens | ఇరాన్ (Iran)పై ఇజ్రాయెల్ (Israel) భీక‌ర దాడులు మొద‌లు పెట్టింది. రాజ‌ధాని టెహ్రాన్‌పై క్షిప‌ణులు, డ్రోన్‌ల‌తో విరుచుకుప‌డింది. తాజా దాడుల‌తో భార‌త్ అప్ర‌మ‌త్త‌మైంది. ఈ మేర‌కు ఇజ్రాయెల్‌, ఇరాన్‌లోని పౌరుల‌కు రాయ‌బార కార్యాల‌యాలు (Indian Embassy) కీల‌క అడ్వైజ‌రీ జారీ చేశాయి (India releases advisory for citizens).

ప్ర‌స్తుతం రెండు దేశాల్లో నెల‌కొన్న యుద్ధ‌ ప‌రిస్థితుల దృష్ట్యా అక్క‌డ నివ‌సించే భార‌తీయ పౌరులంతా అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్లాల‌ని సూచించాయి. స్థానిక అధికారులు జారీ చేసే మార్గ‌ద‌ర్శ‌కాల‌ను, సూచ‌న‌లు పాటించాల‌ని తెలిపాయి. అన‌వ‌స‌ర‌మైన ప్ర‌యాణాల‌కు దూరంగా ఉండాల‌ని విజ్ఞ‌ప్తి చేశాయి. ఏదైనా అత్య‌వ‌స‌ర‌మైతే ఎంబ‌సీని సంప్రదించాల‌ని సూచించాయి. త‌దుప‌రి నోటీసులు వ‌చ్చే వ‌ర‌కూ ప్ర‌జ‌లు ఈ సూచ‌న‌ల‌ను పాటించాల‌ని విజ్ఞ‌ప్తి చేశాయి.

శ‌నివారం ఉద‌యం టెహ్రాన్ (Tehran)పై క్షిప‌ణులు, డ్రోన్‌ల‌తో విరుచుకుప‌డింది. దీంతో రాజ‌ధానిలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ సుప్రీం లీడ‌ర్ (Iran Supreme Leader) అయొతుల్లా అలీ ఖ‌మేనీ (Ayatollah Ali Khamenei) కార్యాల‌యం స‌మీపంలోనే ఈ దాడులు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. అయితే, ఆ స‌మ‌యంలో ఖ‌మేనీ త‌న కార్యాల‌యంలో ఉన్నారా..? లేదా..? అనేది తెలియ‌రాలేదు. మ‌రోవైపు ఈ దాడులు చేసింది తామే అని ఇజ్రాయెల్ ప్ర‌క‌టించింది. దీనిని ‘ఆపరేషన్‌ షీల్డ్‌ ఆఫ్‌ జూడా’గా పేర్కొంది. త‌మ దేశంపై దాడిని అడ్డుకునేందుకు ముందు జాగ్ర‌త్త‌గా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఇజ్రాయెల్ ర‌క్ష‌ణ‌మంత్రి తెలిపారు. ఈ దాడులు అమెరికా-ఇజ్రాయెల్ జాయింట్ ఆప‌రేష‌న్‌గా తెలుస్తోంది.ఇదిలా ఉండ‌గా.. ఇజ్రాయెల్‌లో దేశ‌వ్యాప్తంగా ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించింది. క్షిప‌ణులు, డ్రోన్ల దాడులు జ‌రిగే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించిన‌ట్లు డిఫెన్స్ మినిస్ట‌ర్ తెలిపారు. మ‌రోవైపు ఇరాన్‌, ఇజ్రాయెల్ త‌న గ‌గ‌న‌త‌లాన్ని మూసివేశాయి.

Also Read..

Israel Strikes Iran | ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. ఖ‌మేనీ కార్యాల‌యం స‌మీపంలో పేలుళ్లు

Menaka Guruswamy | తొలిసారి రాజ్యసభకు LGBTQ కమ్యూనిటీ మహిళ.. ఎవ‌రీ మేనకా గురుస్వామి..?

HPV vaccination | దేశ‌వ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

Advertisement
Advertisement