త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ukrainian Drones | ర‌ష్యాపై మ‌రోసారి డ్రోన్ల దాడి

Ukrainian Drones | ర‌ష్యాపై ఉక్రెయిన్ మ‌రోసారి డ్రోన్ల దాడి చేసింది. సోమ‌వారం ఉద‌యం రాజ‌ధాని ల‌క్ష్యంగా డ్రోన్ల‌ను ప్ర‌యోగించిన‌ట్లు ర‌ష్యా ర‌క్ష‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఈ దాడి కార‌ణంగా మాస్కోలోని నాలుగు విమానాశ్ర‌యాలను కాసేపు మూసివేసిన‌ట్లు అధికారులు తెలిపారు.

D

International | Published On Jun 22, 2026, 2.27 pm IST

Ukrainian Drones | ర‌ష్యాపై మ‌రోసారి డ్రోన్ల దాడి
Advertisement

Ukrainian Drones | ర‌ష్యాపై ఉక్రెయిన్ మ‌రోసారి డ్రోన్ల దాడి చేసింది. సోమ‌వారం ఉద‌యం రాజ‌ధాని ల‌క్ష్యంగా డ్రోన్ల‌ను ప్ర‌యోగించిన‌ట్లు ర‌ష్యా ర‌క్ష‌ణ శాఖ అధికారులు తెలిపారు. సుమారు 59 డ్రోన్ల‌ను త‌మ వైమానిక ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లు అడ్డుకున్న‌ట్లు మాస్కో మేయ‌ర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. ఈ దాడి కార‌ణంగా మాస్కోలోని నాలుగు విమానాశ్ర‌యాలను కాసేపు మూసివేసిన‌ట్లు అధికారులు తెలిపారు.

ఆదివారం సాయంత్రం ఉక్రెయిన్‌లోని ద‌క్షిణ ఒడెస్సా ప్రాంతంపై ర‌ష్యా ఇస్కంద‌ర్ బాలిస్టిక్ క్షిప‌ణితో దాడి చేసింది. ఈ దాడిలో ఒక‌రు మ‌ర‌ణించ‌గా, ముగ్గురు గాయ‌ప‌డిన‌ట్లు ప్రాంతీయ గ‌వ‌ర్న‌ర్ ఒలేహ్ కిపెరా తెలిపారు. ఒడెస్సా జిల్లాలోని ఒక వ్యవసాయ క్షేత్రాన్ని ఈ క్షిపణి తాకడంతో వాహనాలు, ఇంధన నిల్వ ట్యాంకుల్లో మంటలు చెలరేగిన‌ట్లు చెప్పారు.

కాగా, గ‌త‌వారం ర‌ష్యాపై ఉక్రెయిన్ అతి పెద్ద దాడి చేసిన విష‌యం తెలిసిందే. మాస్కోలోని ప‌లు ప్రాంతాల‌పై వంద‌లాది డ్రోన్ల‌తో విరుచుకుప‌డింది. కీవ్ ప్ర‌యోగించిన డ్రోన్లు ప‌లు భ‌వ‌నాలు, షాపింగ్ కాంప్లెక్స్‌ను తాకాయి. మాస్కోలోని ఓ చ‌మురు శుద్ధి క‌ర్మాగారం స‌మీపంలో కూడా దాడులు జ‌ర‌గ‌డంతో అక్క‌డ భారీగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో మంట‌లు పెద్ద ఎత్తున ఎగ‌సిప‌డ్డాయి. ఇక ఈ భారీ దాడి త‌ర్వాత మాస్కోలో బ్లాక్ రెయిన్ కురిసింది. ఇలా వ‌రుస దాడుల‌తో ఆ ప్రాంత ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

Also Read..

భార‌త్‌కు ర‌క్ష‌ణ స‌హ‌కారం.. రూ.4,500 కోట్ల సైనిక ప్యాకేజీకి అమెరికా ఆమోదం

250 kmph వేగంతో దూసుకొచ్చి.. డివైడ‌ర్‌ను ఢీ కొట్టిన బీఎండ‌బ్ల్యూ కారు.. ఎగిరిప‌డ్డ మృత‌దేహాలు

ఏఐ ప్ల‌స్ నోవా 2 నియో, నోవా 2 ప్రో 5జీ ఫోన్లు లాంచ్.. ధ‌ర త‌క్కువ‌, ఫీచ‌ర్లు ఎక్కువ‌..

Advertisement
Advertisement