త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Plane Crash | కుప్ప‌కూలిన సైనిక విమానం.. 19 మంది మృతి

Plane Crash | ర‌ష్యాలోని కెమెరోవో ప్రాంతంలో (Kemerovo region) సైనిక రవాణా విమానం కుప్పకూలింది (Russian military transport plane). ఈ దుర్ఘ‌ట‌న‌లో 19 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు మాస్కో రక్షణ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

D

International | Published On Nov 18, 2026, 1.27 pm IST

Plane Crash | కుప్ప‌కూలిన సైనిక విమానం.. 19 మంది మృతి
Advertisement

Plane Crash | త్రినేత్ర న్యూస్ : ర‌ష్యాలో ఘోర విమాన ప్ర‌మాదం చోటు చేసుకుంది. సైబీరియాలోని (Siberia) కెమెరోవో ప్రాంతంలో (Kemerovo region) సైనిక రవాణా విమానం కుప్పకూలింది (Russian military transport plane). ఈ దుర్ఘ‌ట‌న‌లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్ర‌మాదాన్ని మాస్కో రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

రష్యాకు చెందిన ఆంటోనోవ్ ఏఎన్‌-12 (Antonov An-12) సైనిక రవాణా విమానం నియమిత ప్రయాణంలో ఉండగా కెమెరోవో ప్రాంతంలోని యగునోవో గ్రామ సమీపంలో కూలిపోయిన‌ట్లు ది మాస్కో (Moscow) టైమ్స్ నివేదించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.

విమానంలోని నాలుగు ఇంజిన్లలోని ఒక‌టి పూర్తిగా కాలిపోయిన‌ట్లు పేర్కొన్నారు. విమాన ప్రమాదానికి ఇంధన లీకేజీ, ఇంజిన్ అగ్నిప్రమాదం, హైడ్రాలిక్ వైఫల్యమే ప్రధాన కారణాలుగా అధికారులు భావిస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను నిర్ధారించేందుకు ర‌ష్యా అధికారులు ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఏఎన్‌-12 విమానం సోవియట్‌ యూనియన్‌ కాలంలో తయారైన సైనిక రవాణా విమానం. నాలుగు ఇంజిన్లు కలిగిన ఈ టర్బోప్రాప్‌ విమానం 1950ల చివరి నుంచి సేవల్లో ఉంది.

Also Read..

పౌల్ట్రీ రైతుల‌కు గుడ్ న్యూస్‌.. బ‌ర్డ్ ఫ్లూకు చెక్ పెట్టేలా తొలి స్వ‌దేశీ వ్యాక్సిన్‌

హ్యాట్రిక్ కొడ‌తాం.. 320 సీట్ల మార్కు దాటడం తథ్యం.. యూపీ ఎన్నిక‌ల‌పై సీఎం యోగి ధీమా

తెలంగాణ హైకోర్టులో గుండెపోటు అత్యవసర చికిత్స కోసం 5 చోట్ల లైఫ్ సేవింగ్ డీఫిబ్రిలేటర్ల ఏర్పాటు

Advertisement
Advertisement