త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India-America Defense | భార‌త్‌కు ర‌క్ష‌ణ స‌హ‌కారం.. రూ.4,500 కోట్ల సైనిక ప్యాకేజీకి అమెరికా ఆమోదం

India-America Defense | భార‌త్‌-అమెరికా మ‌ధ్య ర‌క్ష‌ణ స‌హకారం (India-America Defense) మ‌రింత పెరుగుతోంది. భారత సైనిక సామ‌ర్థ్యాన్ని మ‌రింత‌ పెంచే దిశగా అమెరికా తాజాగా కీల‌క నిర్ణయం తీసుకుంది.

D

National | Published On Jun 22, 2026, 2.10 pm IST

India-America Defense | భార‌త్‌కు ర‌క్ష‌ణ స‌హ‌కారం.. రూ.4,500 కోట్ల సైనిక ప్యాకేజీకి అమెరికా ఆమోదం
Advertisement

India-America Defense | భార‌త్‌-అమెరికా మ‌ధ్య ర‌క్ష‌ణ స‌హకారం (India-America Defense) మ‌రింత పెరుగుతోంది. భారత సైనిక సామ‌ర్థ్యాన్ని మ‌రింత‌ పెంచే దిశగా అమెరికా తాజాగా కీల‌క నిర్ణయం తీసుకుంది. భారత్‌ అమ్ములపొదిలో ఇప్ప‌టికే సేవ‌లందిస్తున్న అపాచీ హెలికాప్టర్లు (Apache Helicopters), ఎం-777 ఏ2 అల్ట్రా లైట్ హోవిట్జర్ల (M-777 A2 ultra-light howitzers) నిర్వ‌హ‌ణ‌, సాంకేతిక స‌హ‌కారం, విడిభాగాల సరఫరా, శిక్షణ సేవలు అందించేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం మొత్తం రూ.4,500 కోట్ల విలువైన (482.2 మిలియన్ డాలర్ల) 'సస్టైన్‌మెంట్ సపోర్ట్ ప్యాకేజీ'ని ట్రంప్ యంత్రాంగం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ ప్రతిపాదిత ఒప్పందానికి సంబంధించి అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్‌కు అధికారిక సమాచారాన్ని అందించింది. కాగా, ఈ ఒప్పందానికి గ‌త నెల‌లోనే అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే.

విదేశాలకు ఆయుధ విక్రయాలను పర్యవేక్షించే ది డిఫెన్స్‌ సెక్యూరిటీ కోఆపరేషన్‌ ఏజెన్సీ జారీ చేసిన నోటిఫికేష‌న్ ప్ర‌కారం.. M777A2 అల్ట్రా-లైట్ హోవిట్జర్లకు సంబంధించిన నిర్వ‌హ‌ణ‌, విడిభాగాలు, స‌ర‌ఫ‌రా, మ‌ర‌మ్మ‌తులు, సాంకేతిక సాయం, శిక్ష‌ణ‌, ఫీల్డ్ స‌ర్వీస్ ప్ర‌తినిధుల సేవ‌లు, లాజిస్టిక్స్ మ‌ద్ద‌తు అందించ‌నుంది. దీని అంచ‌నా వ్య‌యం దాదాపు రూ.2,217 కోట్లు (230 మిలియన్ డాలర్లు)గా అగ్ర‌రాజ్యం నిర్ణ‌యించింది. ఈ ఒప్పందానికి బీఏఈ సిస్టమ్స్ (BAE Systems) ప్రధాన కాంట్రాక్టర్‌గా వ్యవహరించనుంది. ప్రస్తుతం భారత సైన్యం ఎం777ఏ2 అల్ట్రా- లైట్ హోవిట్జర్లను విస్తృతంగా వినియోగిస్తోంది. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో వేగంగా మోహరించగల సామర్థ్యం ఉండటం వల్ల ఇవి వ్యూహాత్మకంగా కీలకంగా మారాయి.

ఇక దీంతోపాటూ.. AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్ల నిర్వహణ సహాయాన్ని (సస్టైన్‌మెంట్ సపోర్ట్) కూడా భారత్ అభ్యర్థించింది. దీనికి అంచ‌నా వ్య‌యం రూ.1,909 కోట్లు (198.2 మిలియన్ డాలర్లు)గా అమెరికా నిర్ణ‌యించింది. ఇందులో ఇంజినీరింగ్, సాంకేతిక, లాజిస్టిక్స్ మద్దతు, సిబ్బందికి శిక్షణ వంటి సేవలు అందిస్తారు. అపాచీ ప్రోగ్రామ్‌కు బోయింగ్ కంపెనీ (Boeing Company), లాక్‌హీడ్ మార్టిన్ (Lockheed Martin) సంస్థలు ప్రధాన కాంట్రాక్టర్లుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నాయి.

Also Read..

పోర్న్‌ వీడియోలు చూసి.. 9 నెల‌ల ప‌సికందుపై అత్యాచారం

ఏఐ ప్ల‌స్ నోవా 2 నియో, నోవా 2 ప్రో 5జీ ఫోన్లు లాంచ్.. ధ‌ర త‌క్కువ‌, ఫీచ‌ర్లు ఎక్కువ‌..

రైళ్ల‌లో ఇక టిక్కెట్ లేకుండా ప్ర‌యాణిస్తే రెట్టింపు జ‌రిమానా.. జూలై 1 నుంచి కొత్త రూల్స్‌..

Advertisement
Advertisement