త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Black Rain | ఉక్రెయిన్‌ డ్రోన్ దాడి ఎఫెక్ట్‌.. మాస్కోపై బ్లాక్ రెయిన్‌..!

Black Rain | ఉక్రెయిన్ జ‌రిపిన భారీ డ్రోన్ దాడి (Ukrainian drone strike) కార‌ణంగా మాస్కోలో బ్లాక్ రెయిన్ (Black Rain) కురిసింది. ఫ‌లితంగా ప‌రిస‌ర ప్రాంతాలు, వాహ‌నాలు, ఇళ్ల పై క‌ప్పుల‌పై బూడిద పొర‌లా పేరుకుపోయింది.

D

International | Published On Jun 19, 2026, 4.49 pm IST

Black Rain | ఉక్రెయిన్‌ డ్రోన్ దాడి ఎఫెక్ట్‌.. మాస్కోపై బ్లాక్ రెయిన్‌..!
Advertisement

Black Rain | ఉక్రెయిన్ జ‌రిపిన భారీ డ్రోన్ దాడి (Ukrainian drone strike) కార‌ణంగా మాస్కోలో బ్లాక్ రెయిన్ (Black Rain) కురిసింది. రష్యాపై కీవ్ గురువారం వంద‌లాది డ్రోన్ల‌ను ప్ర‌యోగించిన విష‌యం తెలిసిందే. మాస్కో (Moscow)లోని ఓ చమురు శుద్ధి కర్మాగారం (oil refinery)పై కూడా దాడి జ‌రిగింది. ఈ దాడి కార‌ణంగా స‌ద‌రు క‌ర్మాగారంలో పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. న‌ల్ల‌టి చ‌మురు క‌ణాలు వాతావ‌ర‌ణంలో క‌లిసిపోయాయి. ఫ‌లితంగా ఆకాశం మొత్తం న‌ల్ల‌గా మారిపోయిన‌ట్లు అంత‌ర్జాతీయ మీడియా నివేదించింది. ఆ క‌ణాలు వర్షపు బిందువులతో కలవడంతో నల్లటి వర్షం కురిసిన‌ట్లు పేర్కొంది.

 

ఈ బ్లాక్ రెయిన్ కార‌ణంగా ప‌రిస‌ర ప్రాంతాలు, వాహ‌నాలు, ఇళ్ల పై క‌ప్పుల‌పై బూడిద పొర‌లా పేరుకుపోయిన‌ట్లు స‌ద‌రు క‌థ‌నాలు వెల్ల‌డించాయి. అంతేకాదు, ఈ వ‌ర్షం కార‌ణంగా ప్ర‌జ‌లు త‌ల‌నొప్పి, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు ఎదుర్కొన్న‌ట్లు తెలిపాయి. ఇక వైమానిక దాడుల అనంతరం కురిసే ఈ వర్షం అత్యంత ప్రమాదకరమని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించిన‌ట్లు స‌ద‌రు క‌థ‌నాలు వివ‌రించాయి. ఈ వ‌ర్షం నేప‌థ్యంలో అధికారులు ప్ర‌జ‌ల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని, ఇంట్లోనే సుర‌క్షితంగా ఉండాల‌ని సూచించారు. త‌లుపులు, కిటీకీలు కూడా మూసి ఉంచుకోవాల‌ని హెచ్చ‌రించారు.

Also Read..

బాధిత కుటుంబాల‌కు రూ.కోటి ప‌రిహారం ఇవ్వండి.. నీట్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై ప్ర‌ధాని మోదీకి కాక్రోచ్ పార్టీ లేఖ‌

జోనాద‌న్ తీన్‌మార్‌.. 6-0 తేడాతో ఖ‌తార్‌పై మ్యాచ్‌లో విజ‌యం

జియో ఏఐ విప్లవం.. ఒక్క వాయిస్ క‌మాండ్ తో అనేక ప‌నులు..

Advertisement
Advertisement