Ai Plus Nova | ఏఐ ప్లస్ నోవా 2 నియో, నోవా 2 ప్రో 5జీ ఫోన్లు లాంచ్.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ..
Ai Plus Nova | మొబైల్స్ తయారీ సంస్థ ఏఐ ప్లస్ తన నూతన స్మార్ట్ ఫోన్లు నోవా 2 నియో 5జీ, నోవా 2 ప్రో 5జీలను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. పనితీరు, అందుబాటు ధరలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని విడుదల చేసిన ఈ డివైస్‌లు ఎంట్రీ-లెవల్ వినియోగదారుల నుంచి కంటెంట్ క్రియేటర్లు, ప్రొఫెషనల్స్ వరకు విస్తృత వర్గాలను ఆకర్షించేలా రూపొందించామని కంపెనీ తెలిపింది.
Technology | Published On Jun 22, 2026, 2.06 pm IST
Ai Plus Nova | మొబైల్స్ తయారీ సంస్థ ఏఐ ప్లస్ తన నూతన స్మార్ట్ ఫోన్లు నోవా 2 నియో 5జీ, నోవా 2 ప్రో 5జీలను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. పనితీరు, అందుబాటు ధరలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని విడుదల చేసిన ఈ డివైస్‌లు ఎంట్రీ-లెవల్ వినియోగదారుల నుంచి కంటెంట్ క్రియేటర్లు, ప్రొఫెషనల్స్ వరకు విస్తృత వర్గాలను ఆకర్షించేలా రూపొందించామని కంపెనీ తెలిపింది. వాణిజ్య విక్రయాలకు ముందే టెక్ జర్నలిస్టులు, క్రియేటర్లు, కమ్యూనిటీ సభ్యులు ఎలాంటి ఎంబార్గోలు లేదా బ్రాండ్ మార్గదర్శకాలు లేకుండా ఫోన్లను పరీక్షించి సమీక్షించే అవకాశం కల్పించిన ఓపెన్ రివ్యూ ప్రోగ్రామ్‌ను సంస్థ ఇటీవల నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన అభిప్రాయాలను భవిష్యత్ ఉత్పత్తుల మెరుగుదల కోసం ఉపయోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
నోవా 2 నియో 5జీలో..
ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత నెక్స్ట్‌క్వాంటమ్ ఓఎస్‌తో పనిచేస్తాయి. ఇందులో నెక్స్ట్‌ప్రైవసీ డ్యాష్‌బోర్డ్, ఏఐ కీ తదితర ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. నోవా 2 నియో 5జీ ఈ సిరీస్‌లో ఎంట్రీ-లెవల్ మోడల్‌గా ఉండగా, తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వినియోగదారులు, మొదటిసారి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వారిని లక్ష్యంగా చేసుకుంది. నోవా 2 నియో 5జీలో 6.74 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ హెచ్‌బీఎం బ్రైట్‌నెస్ లను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. 4జీబీ, 6జీబీ ర్యామ్, 64జీబీ, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. అలాగే మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2టీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉండగా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎఫ్‌ఎం రేడియో, ఐపీ65 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
నోవా 2 ప్రో జీలో..
ఇక నోవా 2 ప్రో 5జీ మరింత శక్తివంతమైన ప్రాసెసింగ్, మెరుగైన మల్టీమీడియా అనుభవం, కంటెంట్ క్రియేషన్ అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంది. ఈ ఫోన్‌లో కస్టమైజ్ చేసుకునే రియర్ ప్యానెల్ నోటిఫికేషన్ లైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ డివైస్‌లో 6.9 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ హెచ్‌బీఎం బ్రైట్‌నెస్ లను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ఆక్టాకోర్ ప్రాసెసర్ ను ఇచ్చారు. 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. అలాగే మైక్రో ఎస్‌డీ ద్వారా 2టీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. వెనుక వైపు 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను ఇవ్వగా మరో 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. ముందు వైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు. స్టీరియో స్పీకర్లు, బ్లూటూత్ 5.4, ఐపీ65 రేటింగ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి.
ధర ఎంతంటే..
నోవా 2 నియో 5జీ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 128జీబీ మోడల్ ధఱ రూ.12,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.13,999గా నిర్ణయించారు. నోవా 2 ప్రో 5జీ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.15,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.17,999గా నిర్ణయించారు. అన్ని ప్రధాన క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.1వేయి ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను జూన్ 26 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు.
తాజావార్తలు
- ●India-America Defense | భారత్‌కు రక్షణ సహకారం.. రూ.4,500 కోట్ల సైనిక ప్యాకేజీకి అమెరికా ఆమోదం
- ●Ramchandar Rao | బీజేపీలోకి మెగాస్టార్ చిరంజీవి?
- ●Train Ticket | రైళ్లలో ఇక టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే రెట్టింపు జరిమానా.. జూలై 1 నుంచి కొత్త రూల్స్..
- ●Uttar Pradesh | పోర్న్ వీడియోలు చూసి.. 9 నెలల పసికందుపై అత్యాచారం
- ●HIV | హెచ్ఐవీ రోగులకు కొత్త ఆశ.. ప్రపంచంలోనే తొలి హెచ్ఐవీ-టు-హెచ్ఐవీ ఊపిరితిత్తుల మార్పిడి విజయవంతం..
- ●Ramakrishna Rao | సీఎస్ రామకృష్ణా రావుకు మళ్లీ ఎక్స్ టెన్షన్?

India-America Defense | భారత్‌కు రక్షణ సహకారం.. రూ.4,500 కోట్ల సైనిక ప్యాకేజీకి అమెరికా ఆమోదం

Ramchandar Rao | బీజేపీలోకి మెగాస్టార్ చిరంజీవి?

Train Ticket | రైళ్లలో ఇక టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే రెట్టింపు జరిమానా.. జూలై 1 నుంచి కొత్త రూల్స్..

Uttar Pradesh | పోర్న్ వీడియోలు చూసి.. 9 నెలల పసికందుపై అత్యాచారం



