Planes Suffer Tyre Fire During landing | ల్యాండింగ్ సమయంలో విమానం టైర్ నుంచి మంటలు
Planes Suffer Tyre Fire During landing | నేపాల్ (Nepal) రాజధాని ఖాఠ్మండు (Khatmandu)లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Tribhuvan International Airport)లో టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు (Turkish Airlines planes) చెందిన విమానం ప్రమాదానికి గురైంది. రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా రాపిడ్ కారణంగా కుడివైపు టైరు వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
International | Published On May 11, 2026, 11.15 am IST
Planes Suffer Tyre Fire During landing | నేపాల్ (Nepal) లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ (Landing) సమయంలో విమానం చక్రాల్లోనుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాజధాని ఖాఠ్మండు (Khatmandu)లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Tribhuvan International Airport)లో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో విమానంలో 278 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నారు.
టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు (Turkish Airlines planes) చెందిన ‘TK726’ కాల్ సైన్ విమానం ఇవాళ ఉదయం ఇస్తాంబుల్ నుంచి ఖాఠ్మండుకు వచ్చింది. త్రిభువన్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా రాపిడ్ కారణంగా కుడివైపు టైరు వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చక్రాల నుంచి దట్టమైన పొగ వచ్చింది. ఈ ఘటనతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని రన్ వేపై ఆపేసి.. ఎమర్జన్సీ ఎగ్జిట్ మార్గాల ద్వారా ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. మరోవైపు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, త్రిభువన్ ఎయిర్‌పోర్టులో వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2015లో కూడా టర్కిష్ సంస్థకు చెందిన ఒక విమానం ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి రన్‌వే నుండి పక్కకు జరిగింది. ఆ సమయంలో విమానంలో 224 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. అదృష్టవశాత్తూ అప్పుడు కూడా ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన కారణంగా ఎయిర్‌పోర్టును నాలుగు రోజుల పాటు మూసేయాల్సి వచ్చింది.
Also Read..
భారీగా పెరిగిన చమురు ధరలు.. బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరుతుందా..?
ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన సీఎం విజయ్
ఎగిసిపడ్డ మంటలు.. కాకతీయ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుప్రమాదం..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

SpiceJet Flight | ల్యాండ్ అయిన వెంటనే పేలిన టైర్.. ముంబై-దర్భంగా విమానానికి తప్పిన పెను ప్రమాదం
జూన్ 30, 2026

Indian Mangoes | భారతీయ మామిడి పండ్లపై నేపాల్ నిషేధం..? కేంద్రం క్లారిటీ
జూన్ 11, 2026

Nepal PM Balen Shah | ‘మేమూ ఇండియాలోకి చొరబడ్డాం’.. నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. భగ్గుమన్న విపక్షాలు, విద్యార్థులు
జూన్ 2, 2026
తాజావార్తలు
- ●Divyabharathi | హాట్ ఫొటోలతో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్ హీరోయిన్
- ●Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ●Corporation chairmens tenure | రేపటితో 34 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవీ కాలం పూర్తి..
- ●Ponnam Prabhakar | రాముడి పేరుతో దోచుకున్నందుకు బీజేపీ క్షమాపణ చెప్పాలి
- ●RGI Airport | ప్రయాణీలకు యూడీఎఫ్ షాక్.. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న జీఎంఆర్..!
- ●Sandeep Vanga | ప్రభాస్ స్పిరిట్ కంటే ముందే సందీప్ వంగా కొత్త మూవీ రిలీజ్ - రోమాంచకం గ్లింప్స్ వచ్చేసింది

Divyabharathi | హాట్ ఫొటోలతో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్ హీరోయిన్

Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Corporation chairmens tenure | రేపటితో 34 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవీ కాలం పూర్తి..

Ponnam Prabhakar | రాముడి పేరుతో దోచుకున్నందుకు బీజేపీ క్షమాపణ చెప్పాలి



