త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sandeep Vanga | ప్ర‌భాస్ స్పిరిట్ కంటే ముందే సందీప్ వంగా కొత్త మూవీ రిలీజ్ – రోమాంచకం గ్లింప్స్ వ‌చ్చేసింది

ప్ర‌భాస్ స్పిరిట్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న రోమాంచ‌కం మూవీ రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. సెప్టెంబ‌ర్ 3న ఈ ల‌వ్‌స్టోరీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. సుమంత్ ప్ర‌భాస్‌, అనంతిక స‌నిల్ కుమార్ జంట‌గా న‌టిస్తున్న రోమాంచికం గ్లింప్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

N

Entertainment | Published On Jul 6, 2026, 6.59 pm IST

Sandeep  Vanga | ప్ర‌భాస్ స్పిరిట్ కంటే ముందే సందీప్ వంగా కొత్త మూవీ రిలీజ్ – రోమాంచకం గ్లింప్స్ వ‌చ్చేసింది
Advertisement

Sandeep Vanga |  ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో స్పిరిట్ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు డైరెక్ట‌ర్ సందీప్ వంగా. హై ఇంటెన్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఈ సినిమాతో బిజీగా ఉన్న సందీప్ వంగా ప్ర‌జెంట‌ర్‌గా... రోమాంచ‌కం పేరుతో ఓ చిన్న సినిమాను రూపొందిస్తున్నాడు.

అనంతిక స‌నిల్ కుమార్‌...

యూనిక్‌ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో సుమంత్ ప్ర‌భాస్‌, అనంతిక స‌నిల్ కుమార్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రోమాంచ‌కం సినిమాతో వేణు గోపాల్ రెడ్డి డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సందీప్ వంగా ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ సినిమాకు అత‌డి సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు.

గ్లింప్స్ రిలీజ్‌...

రోమాంచకం మూవీ గ్లింప్స్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు. నాయ‌కానాయిక‌ల ప్రేమ‌క‌థ‌ను డిఫ‌రెంట్‌గా చూపిస్తూ గ్లింప్స్ ఆస‌క్తిక‌రంగా సాగింది. అధ‌రం మ‌ధురం అంటూ ఓ మెలోడీ సాంగ్‌తో గ్లింప్స్ మొద‌లైంది. ఆ త‌ర్వాత అణువు అణువును ఉర్రూతలూపే ప్రణయ కల్లోలమే — రోమాంచకం, ఊహకే అందని ఉవ్వెత్తునెగిసే ఉత్తుంగ తరంగమే — రోమాంచకం.. అంటూ ఫాస్ట్ బీట్ సాంగ్‌తో నాయ‌కానాయిక‌ల కెమిస్ట్రీని రొమాంటిక్‌గా ఆవిష్క‌రించారు. హీరోహీరోయిన్లు బ్రేక‌ప్ చెప్పుకునే సీన్ కొత్త‌గా ఉంది. సుమంత్ ప్ర‌భాస్‌, అనంతిక జోడీ బాగుంది.

రిలీజ్ డేట్ ఫిక్స్‌...

సెప్టెంబ‌ర్ 3న రోమాంచ‌కం సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. జూలై నెలాఖ‌రులోపు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంద‌ట‌. ఈ సినిమాలో పెద్ది ఫేమ్ ఉపేంద్ర లిమాయోతో పాటు వెంక‌టేష్ కాకుమాను, న‌రేంద్ర ర‌వి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. వాసుకు వైభ‌వ్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రోమాంచ‌కం మూవీ సాగ‌నున్న‌ట్లు స‌మాచారం.

Advertisement
Advertisement