త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SpiceJet Flight | ల్యాండ్ అయిన వెంట‌నే పేలిన టైర్‌.. ముంబై-ద‌ర్భంగా విమానానికి త‌ప్పిన పెను ప్ర‌మాదం

SpiceJet Flight | ముంబై-ద‌ర్భంగా (Mumbai to Darbhanga) స్పైస్‌జెట్ విమానానికి (SpiceJet Flight) పెను ప్ర‌మాదం త‌ప్పింది. విమానం ద‌ర్భంగా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ (landing) అయిన వెంట‌నే టైర్ బ‌ర‌స్ట్ (Tyre Bursts) అయింది. ఫ‌లితంగా విమానం ర‌న్‌వేపై కొంత‌దూరం ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది. దీంతో ప్ర‌యాణికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. పైల‌ట్ చాక‌చ‌క్యంతో విమానాన్ని సుర‌క్షితంగా ల్యాండ్ చేయ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది.

D

National | Published On Jun 30, 2026, 12.34 pm IST

SpiceJet Flight | ల్యాండ్ అయిన వెంట‌నే పేలిన టైర్‌.. ముంబై-ద‌ర్భంగా విమానానికి త‌ప్పిన పెను ప్ర‌మాదం
Advertisement

SpiceJet Flight | ముంబై నుంచి ద‌ర్భంగా (Mumbai to Darbhanga) వ‌స్తున్న స్పైస్‌జెట్ విమానానికి (SpiceJet Flight) పెను ప్ర‌మాదం త‌ప్పింది. విమానం ద‌ర్భంగా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ (landing) అయిన వెంట‌నే ఓ టైరు పేలిపోయింది (Tyre Bursts). ప్ర‌మాద స‌మ‌యంలో విమానంలో 150 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌తో వారంతా ఒక్క‌సారిగా భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. అయితే, పైల‌ట్ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి విమానాన్ని సుర‌క్షితంగా ల్యాండ్ చేయ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది.

అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. స్పైస్‌జెట్‌కు చెందిన SG115 విమానం సోమ‌వారం ముంబై నుంచి ద‌ర్భంగాకు వ‌చ్చింది. అక్క‌డ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన వెంట‌నే ఓ టైరు పేలిపోయింది. దీంతో ర‌న్‌వేపై కొంత దూరం వ‌ర‌కూ ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది. ఫ‌లితంగా విమానం తీవ్ర కుదుపుల‌కు లోనైంది. అందులోని ప్ర‌యాణికులు భ‌యంతో వ‌ణికిపోయారు.

అప్ర‌మ‌త్త‌మైన పైల‌ట్ ఎంతో చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి విమానాన్ని అదుపుచేసి సుర‌క్షితంగా ల్యాండ్ చేశారు. వెంట‌నే రంగంలోకి దిగిన ఇంజినీర్ల బృందం.. విమానంలోని ప్ర‌యాణికుల‌నంతా సుర‌క్షితంగా కింద‌కు దింపేశారు. అనంత‌రం విమానాన్ని ప్ర‌ధాన ర‌న్‌వే నుంచి ఏప్రాన్‌కు త‌ర‌లించారు. అక్క‌డ స్పైస్‌జెట్ ఇంజినీర్ల బృందం టైర్ పేలిపోవ‌డానికి గ‌ల కార‌ణాన్ని తెలుసుకునేందుకు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికీ ఎలాంటి గాయాలూ కాలేద‌ని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా.. సోమ‌వారం ఇదే విమానాశ్ర‌యంలో ముంబై నుంచి వ‌చ్చిన ఆకాశ ఎయిర్ విమానంలోనూ సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తింది. ఈ రెండు విమానాల‌ను మ‌ర‌మ్మ‌తుల కోసం రాత్రంతా విమానాశ్ర‌యంలోనే ఉంచాల్సి రావ‌డంతో మంగ‌ళ‌వారం వ‌ర‌కూ ఈ ఎయిర్‌పోర్టులో విమాన స‌ర్వీసుల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. ఇక స్పైస్‌జెట్ విమానం ఏప్రాన్‌కు త‌ర‌లించ‌డంతో ఢిల్లీ నుంచి ద‌ర్భంగా రావాల్సిన ఇండిగో విమానాన్ని అధికారులు దారి మ‌ళ్లించారు. బీహార్ పాట్నా ఎయిర్‌పోర్టుకు మ‌ళ్లించిన‌ట్లు అధికారులు తెలిపారు. రన్‌వే క్లియ‌ర్ అయిన త‌ర్వాతే ఆ విమానం తిరిగి ద‌ర్భంగా చేరుకుంటుంద‌ని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement