RGI Airport | ప్రయాణీలకు యూడీఎఫ్ షాక్.. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న జీఎంఆర్..!
RGI Airport | శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు త్వరలో షాక్ తగలనున్నది. యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు చెల్లింపు విధానంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
RGI Airport | శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు త్వరలో షాక్ తగలనున్నది. యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు చెల్లింపు విధానంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు విమానాశ్రయం నుంచి బయలుదేరే ప్రయాణికులకే పరిమితమైన ఈ ఫీజును.. ఇకపై హైదరాబాద్‌కు చేరుకునే ప్రయాణికులకుందరికీ వర్తింపజేయాలని విమానాశ్రయ నిర్వహణ సంస్థ జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) ప్రతిపాదించింది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఈఆర్ఏ)కు ప్రతిపాదనలు పంపింది. కొత్త ప్రతిపాదన ప్రకారం.. యూడీఎఫ్‌ను డిపార్చర్, అరైవల్ ప్రయాణికుల మధ్య విభజించనున్నారు. దేశీయ ప్రయాణికుల నుంచి బయలుదేరే సమయంలో రూ.580, హైదరాబాద్‌కు చేరుకునే సమయంలో రూ.170 వసూలు చేయాలని సూచించారు.
అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో డిపార్చర్‌కు రూ.1,150, అరైవల్‌కు రూ.350గా యూడీఎఫ్‌ను నిర్ణయించాలని ప్రతిపాదించారు. అయితే, ఈ ఛార్జీలు వెంటనే అమల్లోకి వచ్చే అవకాశం లేదు. ఏఈఆర్ఏ ఆమోదం లభించిన పక్షంలో 2026 సెప్టెంబర్ 1 నుంచి జారీ అయ్యే విమాన టికెట్లకే ఈ కొత్త విధానం వర్తించనున్నది. విమానాశ్రయంలో భవిష్యత్తులో పెరగనున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తరణ పనులకు జీఎంఆర్ శ్రీకారం చుట్టింది. వచ్చే మూడేళ్లలో సుమారు రూ.13,975 కోట్లతో కొత్త ప్యాసింజర్ టెర్మినల్, అదనపు రన్‌వే తదితర మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రణాళిక రూపొందించింది. ఈ భారీ పెట్టుబడులకు అవసరమైన నిధుల సమీకరణలో భాగంగానే యూడీఎఫ్ కొనసాగింపు అవసరమని సంస్థ ఏఈఆర్ఏకు వివరించింది. అలాగే 2030-31 నాటికి ఈ ఫీజుల్లో తగ్గింపు చేపట్టే అవకాశాన్ని కూడా ప్రతిపాదనలో ప్రస్తావించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై ఏఈఆర్ఏ పరిశీలన కొనసాగుతోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Allu Arjun | దళపతి విజయ్ రూటులో బన్నీ - రాకా కోసం ఐకాన్ స్టార్ ప్రయోగం
- ●Mahatma Jyotiba Phule Overseas Vidya Nidhi | విదేశాల్లో చదవాలని కలలు కంటున్న బీసీ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
- ●PM Modi | స్కూల్ పిల్లలతో ప్రధాని మోదీ రాఖీ సెలబ్రేషన్స్
- ●Ola Electric | చవక ధరలకే ఓలా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 301 కిలోమీటర్ల రేంజ్..
- ●Dasoju Sravan vs Revanth Reddy | అప్పు పుట్టనిదే పూట గడవని దయనీయ స్థితిలో తెలంగాణ
- ●Minister Vivek | మియోషి మేయర్‌తో మంత్రి వివేక్ భేటీ

Allu Arjun | దళపతి విజయ్ రూటులో బన్నీ - రాకా కోసం ఐకాన్ స్టార్ ప్రయోగం

Mahatma Jyotiba Phule Overseas Vidya Nidhi | విదేశాల్లో చదవాలని కలలు కంటున్న బీసీ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం

PM Modi | స్కూల్ పిల్లలతో ప్రధాని మోదీ రాఖీ సెలబ్రేషన్స్

Ola Electric | చవక ధరలకే ఓలా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 301 కిలోమీటర్ల రేంజ్..






