Crude Oil Prices | భారీగా పెరిగిన చమురు ధరలు.. బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరుతుందా..?
Crude Oil Prices | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి. గ్లోబల్ సరఫరాపై అనిశ్చితి నెలకొనడంతో బ్రెంట్ క్రూడ్, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి చుట్టూ కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Crude Oil Prices | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి. గ్లోబల్ సరఫరాపై అనిశ్చితి నెలకొనడంతో బ్రెంట్ క్రూడ్, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి చుట్టూ కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సోమవారం ఎంసీఎక్స్ క్రూడ్ ఆయిల్ ధరలు 5.51 శాతం వరకు పెరిగి బ్యారెల్‌కు రూ.9,471 స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 104 డాలర్లకు పైగా ట్రేడవుతుండగా, WTI క్రూడ్ కూడా 99 డాలర్ల సమీపంలో కొనసాగుతోంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమవడం, శాంతి ఒప్పందంపై స్పష్టత లేకపోవడాన్ని విశ్లేషకులు చెబుతున్నారు.
ట్రంప్ వ్యాఖ్యలతో..
అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై ఇరాన్ స్పందనను డొనాల్డ్ ట్రంప్ టోటల్లీ అన్‌యాక్సెప్టబుల్ గా అభివర్ణించిన తర్వాత మార్కెట్లో మరింత ఆందోళన పెరిగింది. హోర్ముజ్ జలసంధి పరిస్థితి కూడా కీలక అంశంగా మారింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. అయితే యుద్ధ పరిస్థితుల కారణంగా ట్యాంకర్ రవాణా తీవ్రంగా దెబ్బతింది. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) దీన్ని ప్రపంచ చమురు మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద సరఫరా అంతరాయంగా అభివర్ణించించింది. మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచ సరఫరా చెయిన్‌లపై కూడా ప్రభావం పడుతోంది. చమురు మాత్రమే కాకుండా ఎల్ఎన్‌జీ, ఎరువులు, అల్యూమినియం వంటి కీలక కమోడిటీల సరఫరాపైనా ఒత్తిడి పెరుగుతోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
120 డాలర్లకు చేరుతుందా..
ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) ప్రధాన ఆర్థికవేత్త ఆల్బర్ట్ పార్క్ తెలిపిన ప్రకారం క్రూడ్ ఆయిల్ ధరలు దీర్ఘకాలం పాటు అధిక స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందన్నారు. 2026లో సగటు ధర బ్యారెల్‌కు 96 డాలర్ల సమీపంలో ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది పెద్ద సవాల్‌గా మారుతోంది. ఆర్‌బీఐ గతంలో విడుదల చేసిన నివేదిక ప్రకారం క్రూడ్ ధరలు 10 శాతం పెరిగితే ద్రవ్యోల్బణం 50 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉండగా, ఆర్థిక వృద్ధి 15 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చని హెచ్చరించింది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం సమీప కాలంలో చమురు ధరల్లో అస్థిరత కొనసాగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోతే బ్రెంట్ ధర మళ్లీ 110-120 డాలర్ల స్థాయిలను తాకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే దౌత్య చర్చల్లో పురోగతి కనిపిస్తే ధరల్లో కొంత ఉపశమనం కనిపించవచ్చని భావిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Petrol-Diesel Price | పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చు..! సంకేతాలిచ్చిన కేంద్రమంత్రి హర్దీప్ సింగ్
జులై 2, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లోనే.. పెట్టుబడిదారుల్లో ఊపందుకున్న సెంటిమెంట్..
జులై 2, 2026

Stock Markets | యుద్ధం ఉద్రిక్తతల ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, పెరిగిన చమురు ధరలు..
జూన్ 29, 2026
తాజావార్తలు
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ
- ●Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్
- ●Divyabharathi | హాట్ ఫొటోలతో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్ హీరోయిన్
- ●Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే

SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్

OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్



