Nepal PM Balen Shah | ‘మేమూ ఇండియాలోకి చొరబడ్డాం’.. నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. భగ్గుమన్న విపక్షాలు, విద్యార్థులు
భారత్-నేపాల్ సరిహద్దు వివాదంపై నేపాల్ ప్రధాని బలేన్ షా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఆయన రాజీనామా కోసం దేశవ్యాప్తంగా ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయంటే..!
Nepal PM Balen Shah | త్రినేత్ర.న్యూస్ : నేపాల్ (Nepal) రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఆ దేశ ప్రధాని బలేన్ షా (Balen Shah) భారత్-నేపాల్ సరిహద్దు వివాదంపై చేసిన తాజా వ్యాఖ్యలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సరిహద్దు వివాదాల్లో నేపాల్ తప్పు కూడా ఉందని, మనం కూడా ఇండియా బార్డర్ దాటి ఉంటామని ఆయన పార్లమెంట్‌లో అంగీకరించడంతో.. ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. వెంటనే ఆయన తన ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ రోడ్లపైకి వచ్చి భారీ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
నేపాల్ పార్లమెంట్‌లో దీర్ఘకాలిక సరిహద్దు సమస్యలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని బలేన్ షా మాట్లాడుతూ.. "ఇది వన్ సైడెడ్ ఇష్యూ కాదు. నేపాల్ కూడా పలుచోట్ల భారత భూభాగంలోకి (Indian Territory) వెళ్లి ఉండొచ్చు. ఒకరినొకరు నిందించుకోవడం మాని, చరిత్రకారులు, నిపుణుల సాయంతో దీనిని పరిష్కరించుకోవాలి. ఈ సమస్యల పరిష్కారానికి బ్రిటీష్ కాలం నాటి మ్యాప్‌లు ఉన్నందున యునైటెడ్ కింగ్‌డమ్ (UK) సాయం కూడా తీసుకోవచ్చు" అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో నేపాల్‌లో ఒక్కసారిగా పొలిటికల్ స్టార్మ్ (Political storm) మొదలైంది.
మూడో దేశం జోక్యం అక్కర్లేదు: భారత్
బలేన్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ (MEA) మంగళవారం కౌంటర్ ఇచ్చింది. ఇండో-నేపాల్ సరిహద్దు అంశం పూర్తిగా ద్వైపాక్షిక (Bilateral) వ్యవహారమని, ఇందులో మూడో పక్షం జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదని తేల్చిచెప్పింది. పైగా, వివాదంలో ఉన్న కాలాపానీ, లిపులేఖ్, లింపియాధుర ప్రాంతాలు పూర్తిగా భారతదేశ అంతర్భాగమని, ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదని భారత్ మరోసారి క్లారిటీ ఇచ్చింది.
భగ్గుమన్న విపక్షాలు.. ఆందోళనలో విద్యార్థులు
ప్రధాని బలేన్ షా చేసిన వ్యాఖ్యలను దేశద్రోహంగా అభివర్ణిస్తూ.. సార్వభౌమాధికారాన్ని కాపాడుకుందాం" అనే నినాదాలతో మైతీఘర్ మండలా వద్ద విద్యార్థులు, ప్రతిపక్ష నేతలు భారీ ఎత్తున ధర్నాలకు దిగారు. పార్లమెంట్‌లో కూడా విపక్షాలు ఆందోళన చేయడంతో సభ దద్దరిల్లింది. బలేన్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఒకప్పుడు ర్యాపర్‌గా (Rapper), సివిల్ ఇంజనీర్‌గా, ఆ తర్వాత ఖాట్మండు మేయర్‌గా ఉన్న బలేన్.. ప్రజల ఆందోళనల నడుమ ఒక ఔట్ సైడర్‌గా వచ్చి ప్రధాని అయ్యారు. విచిత్రంగా ఇప్పుడు ఆయనే భారీ ఆందోళనలను ఎదుర్కోవాల్సి వస్తోంది. మేయర్‌గా ఉన్నప్పుడు తన ఆఫీసులో 'గ్రేటర్ నేపాల్' మ్యాప్‌ను పెట్టుకుని ఇండియాకు కౌంటర్ ఇచ్చిన బలేన్.. ఇప్పుడు ప్రధాని హోదాలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
రంగంలోకి ఫారిన్ మినిస్ట్రీ
వివాదం ముదరడంతో నేపాల్ విదేశాంగ శాఖ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టింది. ప్రధాని ఉద్దేశం నేపాల్ భూభాగాన్ని వదులుకోవడం కాదని, కేవలం 'నో-మ్యాన్స్ ల్యాండ్' (No-man's land) వద్ద నదుల ప్రవాహం మారడం వల్ల వచ్చే ప్రాక్టికల్ ఇబ్బందుల గురించే ఆయన మాట్లాడారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ, డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది. పదవి చేపట్టి కొద్ది నెలలే అవుతున్న బలేన్ షా ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడతారో వేచి చూడాలి.
తాజావార్తలు
- ●Dasoju Sravan | ట్రాఫిక్ చలాన్ల ఆటో-డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం.. బ్యాంకు ఖాతాలపై నేరుగా చేయి వేయడం సరికాదు: దాసోజు శ్రవణ్
- ●Dasoju Sravan Kumar | ట్రాఫిక్ చలాన్ల ఆటో డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం
- ●realme P4s 5G | 8000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో.. రియల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్..
- ●Ponguleti Srinivas Reddy | 15,475 మందికి రూ.185 కోట్లు విడుదల చేశాం.. రేపు చివరి బిల్లుల మొత్తం ఖాతాల్లో జమ చేస్తాం
- ●Harish Rao | కాంగ్రెస్ వైఫల్యానికి నాగార్జునసాగర్ కుడి కాలువ నీళ్లే సాక్ష్యం : హరీశ్‌రావు
- ●Stock Markets | అమెరికా ద్రవ్యోల్బణ భయాలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Dasoju Sravan | ట్రాఫిక్ చలాన్ల ఆటో-డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం.. బ్యాంకు ఖాతాలపై నేరుగా చేయి వేయడం సరికాదు: దాసోజు శ్రవణ్

Dasoju Sravan Kumar | ట్రాఫిక్ చలాన్ల ఆటో డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం

realme P4s 5G | 8000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో.. రియల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్..

Ponguleti Srinivas Reddy | 15,475 మందికి రూ.185 కోట్లు విడుదల చేశాం.. రేపు చివరి బిల్లుల మొత్తం ఖాతాల్లో జమ చేస్తాం






