త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | మేం యుద్ధంలో ఉన్నాం.. విమానాలు కూలినా ఇరాన్‌తో చర్చలు ఆగవు : ట్రంప్‌

Donald Trump | ఇరాన్‌తో కొన‌సాగుతున్న యుద్ధంలో అమెరికాకు గ‌ట్టి షాక్ త‌గిలిన విష‌యం తెలిసిందే. రెండు యుద్ధవిమానాలను టెహ్రాన్ కూల్చివేసింది. ఈ నేప‌థ్యంలో విమానాలు కూలిన ఘ‌ట‌న‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యుద్ధవిమానం కూలిపోయినప్పటికీ.. ఇరాన్‌తో జ‌రిగే దౌత్య‌ప‌ర‌మైన చ‌ర్చ‌ల‌పై ఎలాంటి ప్ర‌భావం ఉండ‌బోద‌ని ట్రంప్ స్ప‌ష్టం చేశారు.

D

International | Published On Apr 4, 2026, 11.51 am IST

Donald Trump | మేం యుద్ధంలో ఉన్నాం.. విమానాలు కూలినా ఇరాన్‌తో చర్చలు ఆగవు : ట్రంప్‌
Advertisement

Donald Trump | ఇరాన్‌తో కొన‌సాగుతున్న యుద్ధంలో అమెరికాకు గ‌ట్టి షాక్ త‌గిలిన విష‌యం తెలిసిందే. రెండు యుద్ధవిమానాలను టెహ్రాన్ కూల్చివేసింది. మరో రెండు హెలికాప్టర్ల (Helicopters)పై కూడా దాడి జరిగింది. ఈ ఘటనల్లో ఇద్దరు పైలట్లు (Pilots) సురక్షితంగా బయటపడగా మరో పైలట్‌ గల్లంతయ్యాడు. అత‌డి కోసం అమెరికా, ఇజ్రాయెల్ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. కూలిపోయిన విమానం F-15E Strike Eagle గా గుర్తించారు.

ఈ నేప‌థ్యంలో విమానాలు కూలిన ఘ‌ట‌న‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యుద్ధవిమానం కూలిపోయినప్పటికీ.. ఇరాన్‌తో జ‌రిగే దౌత్య‌ప‌ర‌మైన చ‌ర్చ‌ల‌పై ఎలాంటి ప్ర‌భావం ఉండ‌బోద‌ని ట్రంప్ స్ప‌ష్టం చేశారు. "ఇది యుద్ధం. మేం యుద్ధంలో ఉన్నాం. ఇలాంటి ఘటనలు సహజం. ఇవి ఇరాన్‌తో జ‌రిగే చ‌ర్చ‌ల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపించ‌వు" అని వ్యాఖ్యానించారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ట్రంప్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. అదే స‌మ‌యంలో ఒక‌వేళ ఎఫ్‌-15 యుద్ధ విమానానికి చెందిన పైల‌ట్‌ను ఇరాన్‌ బంధిస్తే ఏం చేస్తారు..? అని ట్రంప్‌ను ప్ర‌శ్నించ‌గా.. అందుకు అధ్య‌క్షుడు స్పందించేందుకు నిరాక‌రించారు. బ‌హుశా అలాంటి సంఘ‌ట‌న జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు అని తెలిపారు.

Also Read..

బడా కంపెనీలే లక్ష్యంగా వాట్సాప్‌లో కొత్త తరహా మోసాల‌కు తెర‌లేపిన నేర‌గాళ్లు.. సీపీ స‌జ్జ‌నార్ కీల‌క హెచ్చ‌రిక‌లు

పెట్రోల్ ధ‌ర‌ల పెంపుపై వెన‌క్కి త‌గ్గిన పాక్ ప్ర‌భుత్వం.. లీట‌రుపై రూ.80 త‌గ్గింపు

ఐటీ రిటర్న్‌లు వేస్తున్నారా..? పాత విధాన‌మేనా, కొత్త‌దానికి మారాలా..?

Advertisement
Advertisement