త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Petrol Price | పెట్రోల్ ధ‌ర‌ల పెంపుపై వెన‌క్కి త‌గ్గిన పాక్ ప్ర‌భుత్వం.. లీట‌రుపై రూ.80 త‌గ్గింపు

Petrol Price | పెట్రోల్ ధరల (Petrol Price) పెంపుపై పాకిస్థాన్ (Pakistan) ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింది. ధ‌ర‌ల‌ను భారీగా పెంచిన మ‌రుస‌టి రోజే లీటర్ పెట్రోల్‌పై రూ.80 మేర తగ్గిస్తూ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

D

International | Published On Apr 4, 2026, 10.36 am IST

Petrol Price | పెట్రోల్ ధ‌ర‌ల పెంపుపై వెన‌క్కి త‌గ్గిన పాక్ ప్ర‌భుత్వం.. లీట‌రుపై రూ.80 త‌గ్గింపు
Advertisement

Petrol Price | పెట్రోల్ ధరల (Petrol Price) పెంపుపై పాకిస్థాన్ (Pakistan) ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింది. ధ‌ర‌ల‌ను భారీగా పెంచిన మ‌రుస‌టి రోజే లీటర్ పెట్రోల్‌పై రూ.80 మేర తగ్గిస్తూ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇరాన్ యుద్ధం కార‌ణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో, గురువారం పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు ఏకంగా 137 రూపాయల మేర పెంచిన విష‌యం తెలిసిందే. దీంతో అక్కడ పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో 458.41 రూపాయలకు చేరింది. ఈ ధ‌ర‌లు శుక్ర‌వారం నుంచే అమ‌ల్లోకి వ‌చ్చాయి. అయితే, పెంపుపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్య‌క్త‌మ‌వ‌డంతో ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింది.

శుక్ర‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత ఆ దేశ ప్ర‌ధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Pakistan PM Shehbaz Sharif) జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా పెట్రోల్‌ ధ‌ర‌ల‌ను తగ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో పెట్రోల్ ధర లీటర్‌కు 378 PKRకి చేరింది. తగ్గిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కార‌ణంగానే దేశీయంగా ధ‌ర‌ల‌ను పెంచాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. సాధారణ ప్రజలపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అయితే, పెట్రోల్ ధరలను తగ్గించిన పాక్.. డీజిల్ ధరలను మాత్రం యథాతథంగా 520 PKR వద్దే ఉంచడం గమనార్హం.

పెట్రోల్ ధరలను తగ్గించడంతో పాటు ప్రజలకు మరింత ఉపశమనం కలిగించేందుకు పాక్ ప్రధాని పలు రాయితీలు ప్రకటించారు. ద్విచక్రవాహనదారులకు లీటర్‌కు 100 PKR సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. నెలకు గరిష్ఠంగా 20 లీటర్ల వరకు మూడు నెలల పాటు ఈ ప్రయోజనం అందించనున్నట్లు తెలిపారు.

కాగా, పాక్ ప్ర‌భుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను (Petrol Diesel Prices) రెండింత‌లు పెంచిన విష‌యం తెలిసిందే. డీజిల్ ధ‌ర‌లు 54.9 శాతం పెర‌గ‌గా, పెట్రోల్ ధ‌ర‌ల‌ను 42.7 శాతం అధికం చేసింది. దీంతో లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.520.35 (పాకిస్థానీ రూపాయలు)కు చేర‌గా, పెట్రోల్ రూ.458.41కి పెరిగింది. సవరించిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో పెట్రోల్ డీజీల్ ధ‌ర‌లు ఆ దేశ‌ చరిత్రలోనే గ‌రిష్ఠానికి చేరుకున్నాయి. ధ‌ర‌ల పెంపుపై ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త‌, ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వడంతో పాక్ ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింది.

Also Read..

ఐటీ రిటర్న్‌లు వేస్తున్నారా..? పాత విధాన‌మేనా, కొత్త‌దానికి మారాలా..?

కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ కాన్వాయ్‌పై దాడి.. గ‌న్‌మెన్‌కు గాయాలు

ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ కొనాల‌ని చూస్తున్నారా..? టాప్ మోడ‌ల్స్ ఇవిగో..!

Advertisement
Advertisement