త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | ఇరాన్‌తో ఘ‌ర్ష‌ణ‌లు మ‌రికొన్ని వారాలు కొన‌సాగొచ్చు : ట్రంప్‌

Donald Trump | ఇరాన్ (Iran)తో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లు మ‌రికొన్ని వారాల పాటూ కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు.

D

International | Published On Mar 2, 2026, 11.32 am IST

Donald Trump | ఇరాన్‌తో ఘ‌ర్ష‌ణ‌లు మ‌రికొన్ని వారాలు కొన‌సాగొచ్చు : ట్రంప్‌
Advertisement

Donald Trump | ఇరాన్ (Iran)తో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లు మ‌రికొన్ని వారాల పాటూ కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. ఈ ఘ‌ర్ష‌ణ అంత త్వ‌ర‌గా ముగిసేది కాద‌ని వ్యాఖ్యానించారు. ఈ ఆప‌రేష‌న్ చాలా సంక్లిష్ట‌మైన‌ద‌ని.. త‌మ ల‌క్ష్యాల‌ను సాధించేందుకు మ‌రికొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపారు. అదే స‌మ‌యంలో ఉద్రిక్త‌త‌లు పెరుగుతున్న‌ప్ప‌టికీ టెహ్రాన్‌తో దౌత్య‌ప‌ర‌మైన చ‌ర్చ‌ల‌కు ద్వారాలు ఇంకా తెరిచే ఉన్నాయ‌ని ఓ మ్యాగ‌జైన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు.

"ఈ ఘర్షణ అంత త్వరగా ముగిసేది కాదు. మ‌రో నాలుగు వారాలు కొన‌సాగొచ్చు. ఇరాన్ బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి. అంత త‌క్కువ అంచ‌నా వేయ‌కూడ‌దు. అదొక పెద్ద దేశం కాబ‌ట్టి కొంత స‌మ‌యం ప‌డుతుంది. ఇరాన్‌ (War with Iran)పై ఆపరేషన్‌ క్లిష్టమైనదే. అయినా, దాడులు జ‌రుపుతున్నాం. యుద్ధ వాతావ‌ర‌ణం ఉన్న‌ప్ప‌టికీ.. చ‌ర్చ‌ల కోసం మా దౌత్య‌మార్గాలు ఇప్ప‌టికీ తెరిచే ఉన్నాయి" అని ట్రంప్‌ వెల్లడించారు. మ‌రోవైపు ఇరాన్ అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని ట్రంప్ ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. కానీ, ఆ చ‌ర్చ‌లు జ‌రుగుతాయో..? లేదో..? చెప్ప‌లేన‌ని వ్యాఖ్యానించారు. చర్చల విషయంలో ఇరాన్ ఆలస్యం చేస్తోందన్నారు. వారు ముందే చ‌ర్చ‌లు జ‌రిపిఉంటే ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌ని వ్యాఖ్యానించారు.

Also Read..

హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం.. 50 గ్రామాల ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేయించిన ఐడీఎఫ్‌

భ‌గ్గుమ‌న్న హ‌ర్ముజ్ జ‌ల‌సంధి.. భార‌తీయుల‌తో వెళ్తున్న‌ చ‌మురు నౌక‌పై ఇరాన్ దాడి

టెహ్రాన్‌లోని గాంధీ ఆసుప‌త్రిపై ఇజ్రాయెల్ దాడులు

Advertisement
Advertisement