Iran Attacks Oil Tanker In Strait Of Hormuz | భగ్గుమన్న హర్ముజ్ జలసంధి.. భారతీయులతో వెళ్తున్న చమురు నౌకపై ఇరాన్ దాడి
Iran Attacks Oil Tanker In Strait Of Hormuz | ఒమన్ తీరానికి సమీపంలో ఉన్నహర్ముజ్ జలసంధి (Strait Of Hormuz) గుండా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్లే లక్ష్యంగా ఇరాన్ దాడులకు తెగబడుతోంది.
International | Published On Mar 2, 2026, 10.24 am IST
Iran Attacks Oil Tanker In Strait Of Hormuz | ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఒమన్ తీరానికి సమీపంలో ఉన్నహర్ముజ్ జలసంధి (Strait Of Hormuz) గుండా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్లే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. తాజాగా హర్ముజ్ జలసంధి మీదుగా పలావు దేశ జెండాతో ప్రయాణిస్తున్న స్కైలైట్ అనే చమురు రవాణా నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఒమన్‌లోని ముసందమ్ ద్వీపకల్పం తీరానికి సమీపంలో ఈ దాడి జరిగింది.
దాడి సమయంలో అందులో 15 మంది భారతీయులు (Indian Crew) కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్ దాడిలో నలుగురు గాయపడినట్లు ఒమన్ తీర ప్రాంత రక్షణ కేంద్రం తెలిపింది. ఈ చమురు నౌకలో మొత్తం 20 మంది ఉన్నట్లు పేర్కొంది. అందులో 15 మంది భారతీయులు కాగా, ఐదుగురు ఇరానియన్లు అని తెలిపింది. ముసందమ్‌లోని ఖాసబ్ పోర్టుకు ఐదు నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగినట్లు వెల్లడించింది. ఈ దాడితో నౌకలోని సిబ్బందిని సురక్షితంగా రక్షించినట్లు తెలిపింది.
ప్రపంచ చమురు రవాణాకు హర్ముజ్ జలసంధి మార్గం ఆయువుపట్టుగా ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం ఈ మార్గం మీదుగానే సాగుతుంది. అయితే, తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ జలసంధి గుండా చమురు రవాణాను నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
Also Read..
Israeli Strikes Hit Tehrans Gandhi Hospital | టెహ్రాన్‌లోని గాంధీ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడులు
AWS Data Center | యూఏఈలో AWS డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి..? వ్యాపించిన మంటలు..
PM Modi | కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

US Iran Peace Memo | అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముగింపు? ‘వన్-పేజీ’ ఒప్పందంతో శాంతి చర్చలకు మార్గం
మే 6, 2026

Strait of Hormuz | ఇరాన్ కొత్త ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్: హార్ముజ్ జలసంధి ఓపెనింగ్‌పై వీడని సస్పెన్స్
మే 2, 2026

Iran US conflict | హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయడానికి ఇరాన్ 3 కండిషన్లు.. ట్రంప్ ఒప్పుకుంటారా?
ఏప్రిల్ 28, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



