Israel | హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 50 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించిన ఐడీఎఫ్
Israel | ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఈ దాడులు మరింత తీవ్రమయ్యాయి.
International | Published On Mar 2, 2026, 10.55 am IST
Israel | ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఈ దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో ఈ యుద్ధంలోకి తాజాగా లెబనాన్ (Lebanon) మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా ( Hezbollah) ఎంట్రీ ఇచ్చింది. ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులకు దిగింది. అయితే, హెజ్బొల్లా దాడులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తిప్పికొడుతోంది. లెబనాన్ రాజధాని బీరుట్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఎదురుదాడికి దిగింది. మిలిటెంట్ కీలక నేతలే లక్ష్యంగా మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది.
తీవ్ర పరిణామాలు తప్పవు.. హెజ్బొల్లాకు ఐడీఎఫ్ హెచ్చరికలు
లెబనాన్ నుంచి ప్రయోగించిన క్షిపణుల కారణంగా ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో సైరన్లు మోగినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. తమ దేశంపై రాత్రిపూట హెజ్బొల్లా దాడులను ప్రారంభించినట్లు ఐడీఎఫ్ దళాలు తెలిపాయి. ఈ దాడుల వల్ల తలెత్తే పరిణామాలకు ఆ సంస్థే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. హెజ్బొల్లా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాయి. ఇజ్రాయెల్ భద్రతకు ముప్పు కలిగించే ఏ శత్రువైనా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉత్తర సరిహద్దులోని ఇజ్రాయెల్ పౌరులకు లేదా నివాస ప్రాంతాలకు ఎటువంటి హాని కలగనివ్వబోమని స్పష్టం చేశారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొనేందుకు తమ దళాలు "ఆపరేషన్ రోరింగ్ లయన్" (Operation Roaring Lion) పేరుతో దాడులకు సిద్ధంగా ఉన్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.
50 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించిన ఐడీఎఫ్..
తమపై దాడికి ప్రతీకారంగానే హెజ్బొల్లా స్థావరాలపై దాడులు చేపట్టినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఈ క్రమంలో లెబనాన్‌లోని సుమారు 50 గ్రామాల ప్రజలు వెంటనే తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం (IDF) సోమవారం హెచ్చరిక జారీ చేసింది. హెజ్బొల్లా ఉగ్రవాదులు తమ సైనిక కార్యకలాపాలను జనావాసాల నుంచే నిర్వహిస్తున్నారని, ఈ కారణంగా సామాన్య పౌరులకు ఎలాంటి ప్రాణనష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఈ హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు లెబనాన్‌పై విరుచుకుపడ్డాయి. రాజధాని బీరుట్‌తో పాటు దక్షిణ, తూర్పు లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి.
Also Read..
Israeli Strikes Hit Tehrans Gandhi Hospital | టెహ్రాన్‌లోని గాంధీ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడులు
AWS Data Center | యూఏఈలో AWS డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి..? వ్యాపించిన మంటలు..
సంబంధిత వార్తలు

West Asia War | పశ్చిమాసియా యుద్ధం వల్ల భారత్‌లో భారీగా పెరగనున్న పేదరికం.. యూఎన్డీపీ అంచనా..
ఏప్రిల్ 14, 2026

Iran | చేసేదేం లేక వట్టి చేతుల్తో వెళ్లిపోయారు.. జేడీ వాన్స్‌పై ఇరాన్ వ్యాఖ్యలు..
ఏప్రిల్ 12, 2026

US-Iran Peace Talks | అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. ఇరాన్‌కు ఇది చేదు వార్త అన్న జేడీ వాన్స్..
ఏప్రిల్ 12, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



