త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Israeli Strikes Hit Tehrans Gandhi Hospital | టెహ్రాన్‌లోని గాంధీ ఆసుప‌త్రిపై ఇజ్రాయెల్ దాడులు

Israeli Strikes Hit Tehrans Gandhi Hospital | ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్ (Tehran)లోని గాంధీ ఆసుప‌త్రి (Gandhi Hospital)పై ఇజ్రాయెల్ క్షిప‌ణుల‌తో దాడి చేసింది. ఈ దాడిలో ఆసుప‌త్రి పూర్తిగా ధ్వంస‌మైంది (Israeli Strikes Hit Tehrans Gandhi Hospital).

D

International | Published On Mar 2, 2026, 10.04 am IST

Israeli Strikes Hit Tehrans Gandhi Hospital | టెహ్రాన్‌లోని గాంధీ ఆసుప‌త్రిపై ఇజ్రాయెల్ దాడులు
Advertisement

Israeli Strikes Hit Tehrans Gandhi Hospital | ప‌శ్చిమాసియాలో యుద్ధ మేఘాలు క‌మ్ముకున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడుల‌ను తీవ్ర‌త‌రం చేశాయి. తాజాగా ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్ (Tehran)లోని గాంధీ ఆసుప‌త్రి (Gandhi Hospital)పై ఇజ్రాయెల్ క్షిప‌ణుల‌తో దాడి చేసింది. ఈ దాడిలో ఆసుప‌త్రి పూర్తిగా ధ్వంస‌మైంది (Israeli Strikes Hit Tehrans Gandhi Hospital). ఉత్త‌ర టెహ్రాన్‌లోని గాంధీ ఆసుప‌త్రిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిన‌ట్లు ప్ర‌ముఖ వార్తా సంస్థ రాయిట‌ర్స్ నివేదించింది. అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది అందులోని రోగుల‌ను సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించిన‌ట్లు పేర్కొంది. ఈ దాడిలో ఆసుప‌త్రి తీవ్రంగా దెబ్బ‌తిన్నది.

https://x.com/TehranTimes79/status/2028182446034894887

గాంధీ ఆసుప‌త్రితోపాటూ మ‌రికొన్ని ఆసుప‌త్రుల‌పై కూడా ఇజ్రాయెల్ దాడులు (Israeli Strikes) చేసిన‌ట్లు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాదు, రేయ్ న‌గ‌రంపై జ‌రిగిన శ‌త్రు దాడిలో పోలీసు హెడ్ క్వార్ట‌ర్స్ భ‌వ‌నం, స‌మీపంలోని నివాస భ‌వనాలు దెబ్బ‌తిన్న‌ట్లు పేర్కొంది. ఈ దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలిపింది. ప‌లువురు శిథిలాల కింద చిక్కుకుపోయిన‌ట్లు వివ‌రించింది.

https://x.com/bishwamaurya_/status/2028180673513824573

ఇక ఆసుప‌త్రుల‌పై దాడుల‌ను ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌ టెడ్రోస్ అథ‌నామ్ (Tedros Adhanom Ghebreyesus) తీవ్రంగా ఖండించారు. ఆసుప‌త్రుల‌పై దాడులు స‌రికాద‌ని పేర్కొన్నారు. ఆరోగ్య సౌక‌ర్యాల‌పై దాడుల‌ను నిరోధించేందుకు అన్ని ప్ర‌య‌త్నాలూ చేయాల‌న్నారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

https://x.com/DrTedros/status/2028221628048449665

Also Read..

AWS Data Center | యూఏఈలో AWS డేటా సెంట‌ర్‌పై ఇరాన్ దాడి..? వ్యాపించిన మంట‌లు..

TGSRTC | గ్రేట‌ర్ ప్ర‌యాణికుల‌కు ఆర్టీసీ షాక్‌.. పెరిగిన టీ 24 టికెట్ ధర

PM Modi | కేంద్ర మంత్రులు, ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌ధాని మోదీ అత్యున్న‌త స్థాయి స‌మావేశం

Advertisement
Advertisement