Donald Trump | బర్గర్ ఆర్డర్ చేసిన ట్రంప్.. డెలివరీ చేసిన వ్యక్తికి టిప్‌గా ఎంత ఇచ్చారంటే..?
Donald Trump | తన విధానపరమైన నిర్ణయాలు, ఇరాన్ యుద్ధం వంటి కారణాలతో నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). తాజాగా మరోసారి ఆయన వార్తల్లోకి ఎక్కారు.
International | Published On Apr 14, 2026, 1.02 pm IST
Donald Trump | తన విధానపరమైన నిర్ణయాలు, ఇరాన్ యుద్ధం వంటి కారణాలతో నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). తాజాగా మరోసారి ఆయన వార్తల్లోకి ఎక్కారు. తాను అధికారంలోకి వచ్చాక అమల్లోకి తెచ్చిన ‘నో ట్యాక్స్ ఆన్ టిప్స్’ (no tax on tips) విధానం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన చేసిన ఓ వినూత్న ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది.
‘నో ట్యాక్స్ ఆన్ టిప్స్’ విధానంపై ప్రచారం చేయడానికి ట్రంప్ తనకు ఎంతో ఇష్టమైన బర్గర్, పిజ్జా వంటి ఫుడ్‌ను స్వయంగా మెక్‌డొనాల్డ్స్ (McDonalds) నుంచి ఆర్డర్ చేశారు. సోషల్ మీడియాలో ‘డోర్‌డాష్ గ్రాండ్మా’గా పాపులర్ అయిన అర్కాన్సాస్‌కు చెందిన షారన్ సిమన్స్ ఈ డెలివరీని అధ్యక్షుడికి అందించారు. డోర్‌డాష్ (DoorDash) గ్రాండ్‌మా అని రాసి ఉన్న టీషర్ట్ ధరించిన ఆమె.. డెలివరీని స్వయంగా ట్రంప్ చేతిలో పెట్టారు. ఈ సందర్భంగా ఆమె యోగక్షేమాలను ట్రంప్ అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ‘నో ట్యాక్స్ ఆన్ టిప్స్’ తో కలిగిన ప్రయోజనాల గురించి కూడా ఆరా తీశారు.
నో ట్యాక్స్ ఆన్ టిప్స్‌తో రూ.9లక్షలు ఆదా..
ఈ సందర్భంగా షారన్ సిమన్స్ తన పని అనుభవాలను ట్రంప్‌తో పంచుకున్నారు. ప్రధానంగా ‘నో ట్యాక్స్ ఆన్ టిప్స్’ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత తన ఆర్థిక పరిస్థితిలో వచ్చిన మార్పును వివరించారు. టిప్స్‌పై పన్ను మినహాయింపుతో గత ఏడాది కాలంలో తనకు సుమారు 11 వేల డాలర్ల (భారత కరెన్సీలో సుమారు ₹9 లక్షలకు పైగా) అదనపు ఆదాయం లభించినట్లు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో టిప్స్‌లో వచ్చిన కొంత భాగం పన్నుల రూపంలోనే ప్రభుత్వానికి వెళ్లేదని తెలిపింది. ఇప్పుడు ఆ మొత్తం తనకే దక్కుతోందని ఆనందం వ్యక్తం చేసింది.
టిప్‌గా వంద డాలర్లు..
ఈ సందర్భంగా డోర్‌డాష్ గ్రాండ్‌మాకు ట్రంప్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా 100 డాలర్లను టిప్‌గా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ఆ టిప్‌ను గ్రాండ్‌మా తీసుకుని ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు.
WATCH IN FULL: @POTUS receives a @DoorDash delivery to the Oval Office.
"I have your @DoorDash order for you, Mr. President!" pic.twitter.com/lwFHbHmYVk
— Rapid Response 47 (@RapidResponse47) April 13, 2026
Also Read..
అల్లర్ల వేళ యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కార్మికుల వేతనాలు 21 శాతం పెంపు
మరో రౌండ్ చర్చలకు సిద్ధమైన అమెరికా-ఇరాన్..!
ఒక్కసారి చార్జ్ చేస్తే 320 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల..
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






