త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US – Iran | మ‌రో రౌండ్ చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మైన అమెరికా-ఇరాన్‌..!

US - Iran | ప‌శ్చిమాసియాలో కొన‌సాగుతున్న యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేసేందుకు, శాంతిని నెల‌కొల్పేందుకు పాకిస్థాన్ రాజ‌ధాని ఇస్లామాబాద్ వేదిక‌గా అమెరికా, ఇరాన్‌ల (US - Iran) మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌లు విఫ‌ల‌మైన విష‌యం తెలిసిందే. ఈ చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌వ‌డంతో మ‌ధ్య‌ప్రాచ్యంలో మ‌ళ్లీ ఉద్రిక్త‌త‌లు త‌లెత్తాయి.

D

International | Published On Apr 14, 2026, 11.20 am IST

US – Iran | మ‌రో రౌండ్ చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మైన అమెరికా-ఇరాన్‌..!
Advertisement

US - Iran | ప‌శ్చిమాసియాలో కొన‌సాగుతున్న యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేసేందుకు, శాంతిని నెల‌కొల్పేందుకు పాకిస్థాన్ రాజ‌ధాని ఇస్లామాబాద్ వేదిక‌గా అమెరికా, ఇరాన్‌ల (US - Iran) మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌లు విఫ‌ల‌మైన విష‌యం తెలిసిందే. ఈ చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌వ‌డంతో మ‌ధ్య‌ప్రాచ్యంలో మ‌ళ్లీ ఉద్రిక్త‌త‌లు త‌లెత్తాయి. ఈ నేప‌థ్యంలోనే ఇరాన్‌-అమెరికా మ‌రో రౌండ్ శాంతి చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఇరు దేశాల మ‌ధ్య ఉన్న రెండు వారాల కాల్పుల విర‌మ‌ణ (ceasefire) ముగియ‌క‌ముందే ఈ చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం. అమెరికా పెట్టిన డిమాండ్ల‌కు టెహ్రాన్ అంగీకారం తెలిపేందుకు సిద్ధంగా ఉంద‌ని న‌మ్మితే ఆ దేశంతో నేరుగా చ‌ర్చ‌లు ప్రారంభించేందుకు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సుముఖత వ్య‌క్తం చేసిన‌ట్లు అమెరిక‌న్ మీడియా నివేదిక‌లు పేర్కొంటున్నాయి.

ఆరు వారాల యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో ఏప్రిల్ 21తో ముగియ‌నున్న రెండు వారాల కాల్పుల విర‌మ‌ణ గ‌డువులోపు కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవాల‌ని ఇరు దేశాలూ ఆలోచిస్తున్న‌ట్లు సంబంధిత వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. ఈ చ‌ర్చ‌ల‌కు ఇరు దేశాలూ అంగీక‌రించిన‌ట్లు మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తున్న దేశాల‌కు చెందిన ఓ దౌత్య‌వేత తెలిపారు. అయితే, రెండో రౌండ్ చ‌ర్చ‌లకు ఏ న‌గ‌రం వేదిక కానుంద‌న్న‌ది మాత్రం ఇంకా డిసైడ్ చెయ్య‌లేద‌ట‌. ఇస్లామాబాద్ లేదా జెనీవా వేదిక‌గా ఈ చ‌ర్చ‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. ఈ చ‌ర్చ‌లు కూడా గురువారం ఉంటాయ‌ని స‌మాచారం.

మ‌ధ్య‌వ‌ర్తిత్వానికి ముందుకొచ్చిన ర‌ష్యా..

ఇదిలా ఉండ‌గా.. ప‌శ్చిమాసియాలో శాంతిని నెల‌కొల్పేందుకు ర‌ష్యా (Russia) ముందుకొచ్చింది. అమెరికా-ఇరాన్ మ‌ధ్య మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని క్రెమ్లిన్ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీతో ర‌ష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఫోన్‌లో మాట్లాడారు.

20 ఏళ్లు నిలిపివేయాలి.. కాదు ఐదేళ్లే ఆపేస్తాం..

గ‌త‌వారాంతంలో పాకిస్థాన్ వేదికగా అమెరికా, ఇరాన్‌ల మధ్య దాదాపు 21 గంట‌ల పాటూ జ‌రిగిన శాంతి చర్చలు విఫలమ‌వ‌డానికి అణు కార్య‌క‌లాపాల‌పై (uranium enrichment) ఏకాభిప్రాయం కుద‌ర‌క‌పోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని తాజాగా తెలిసింది. ఇరాన్ యురేనియంను శుద్ధి చేసే కార్యక్రమాన్ని కనీసం 20 ఏళ్ల పాటు నిలిపివేయాలని అమెరికా పట్టుబట్ట‌గా.. అందుకు ఇరాన్ ససేమిరా అన్న‌ట్లు తెలిసింది. యురేనియం శుద్ధిని గరిష్ఠంగా ఐదేళ్లు మాత్ర‌మే నిలిపివేస్తామ‌ని టెహ్రాన్ స్ప‌ష్టం చేసిన‌ట్లు సంబంధిత వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ అమెరికా మీడియా తెలిపింది. ఈ విష‌యంలో ఏకాభిప్రాయం కుద‌ర‌క‌పోవ‌డంతోనే దాదాపు కొలిక్కి వ‌చ్చిన‌ట్లు క‌నిపించిన చ‌ర్చ‌లు.. అర్ధంత‌రంగా ముగిసిన‌ట్లు స‌ద‌రు క‌థ‌నాలు పేర్కొన్నాయి.

Also Read..

మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026.. ప్రైజ్ మ‌నీ భారీగా పెంపు..

4జి ఫీచ‌ర్ ఫోన్ల‌కు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా మొబైల్ బ్యాంకింగ్ యాప్‌.. ఇక చెల్లింపులు ఎంతో సుల‌భం..

సమ్మె నిర్ణ‌యం వెనక్కి తీసుకోండి.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం: మంత్రి పొన్నం ప్రభాకర్

Advertisement
Advertisement