త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttar Pradesh | అల్ల‌ర్ల వేళ యూపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. కార్మికుల వేత‌నాలు 21 శాతం పెంపు

Uttar Pradesh | కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ నోయిడా (Noida)లో కార్మికులు ఆందోళనకు దిగిన విష‌యం తెలిసిందే. ఈ నిర‌స‌న‌ల వేళ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో కార్మికుల క‌నీస వేత‌నాల‌ను పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

D

National | Published On Apr 14, 2026, 12.22 pm IST

Uttar Pradesh | అల్ల‌ర్ల వేళ యూపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. కార్మికుల వేత‌నాలు 21 శాతం పెంపు
Advertisement

Uttar Pradesh | కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ నోయిడా (Noida)లో కార్మికులు ఆందోళనకు దిగిన విష‌యం తెలిసిందే. సోమ‌వారం ఉద‌యం వేలాది మంది కార్మికులు (workers) రోడ్ల‌పైకి వ‌చ్చి నిర‌స‌న తెలిపారు. వారు చేప‌ట్టిన ఆందోళ‌న హింసాత్మ‌కంగా మారింది. ఇక మంగ‌ళ‌వారం కూడా కార్మికుల నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఈ నిర‌స‌న‌ల వేళ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో కార్మికుల క‌నీస వేత‌నాల‌ను పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కార్మికుల కనీస వేతనాన్ని 21 శాతం వరకు పెంచింది.

అయితే, మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు, జిల్లాల్లో ఈ వేత‌న పెంపు వేర్వేరుగా ఉంటుంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో నోయిడా, ఘ‌జియాబాద్‌లోని సెమీ స్కిల్డ్ కార్మికుల (semi-skilled) క‌నీస వేత‌నం నెల‌కు రూ.12,445 నుంచి రూ.15,059కి పెరిగింది. అదేవిధంగా నైపుణ్యం (skilled) క‌లిగిన కార్మికుల వేత‌నం నెల‌కు రూ. 13,940 నుంచి రూ,16,668కి పెరిగింది. ఈ పెంపు ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. అయితే, ఇది తాత్కాలిక నిర్ణ‌యం మాత్ర‌మేన‌ని.. వేత‌న మండ‌లి స‌మ‌గ్ర స‌మీక్ష త‌ర్వాత దీనిపై పూర్తి నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు వెల్ల‌డించింది.

ధ‌ర‌లు పెరిగాయి.. ఎగుమ‌తులు త‌గ్గాయి..

లేబ‌ర్ కోడ్‌ల కింద జాతీయ స్థాయిలో క‌నీస వేత‌నాల‌ను స‌వ‌రించే ప్ర‌క్రియ కొన‌సాగుతోంద‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. దేశవ్యాప్తంగా కార్మికులకు సమానమైన కనీస వేతనాన్ని అందించడం, వారికి న్యాయమైన వేతనం లభించేలా చూడటమే ఈ చొరవ యొక్క ప్రధాన ఉద్దేశం అని పేర్కొంది. "ప్రస్తుతం పరిశ్రమలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాల ధరలు పెరిగాయి. ఎగుమతులు తగ్గిపోయాయి. అదే సమయంలో కార్మికులు లేవనెత్తిన సమస్యలు, డిమాండ్లు కూడా ముఖ్యమైనవే. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు వ‌ర్గాల‌ను అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం చాలా కీలకం" అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వచ్చే నెలలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే వేతన బోర్డు (Wage Board) సిఫార్సుల తర్వాత కనీస వేతనం నిర్ణయించే ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రభుత్వం ఈ సంద‌ర్భంగా స్పష్టం చేసింది.

300 మంది అరెస్ట్

క‌నీస వేత‌నాలు అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్య‌లో కార్మికులు సోమ‌వారం ఉద‌యం రోడ్ల‌పైకి వ‌చ్చి నిర‌స‌న చేప‌ట్టారు. నోయిడా ఫేజ్-2లోని ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన వందలాది మంది కార్మికులు జీతాలు పెంచాలంటూ కంపెనీ గేటు వద్ద ఆందోళనకు దిగారు. యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలోనే వారు హింసకు పాల్పడ్డారు. ప‌రిశ్ర‌మ‌పైకి రాళ్లు రువ్వారు. ప‌లు వాహ‌నాల‌కు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించారు. రంగంలోకి దిగిన పోలీసులు ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీఛార్జ్ చేశారు. టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ప‌రిశ్ర‌మ‌లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇప్ప‌టి వ‌ర‌కూ 300 మందికిపైగా కార్మికుల‌ను అరెస్ట్ చేశారు. మ‌రో వంద మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. రాష్ట్రంలో అస్థిరత సృష్టించడమే లక్ష్యంగా ఈ కుట్ర జరిగినట్లు అనుమానిస్తున్నారు.

అల్లర్ల వెనుక పాక్ హస్తం..?

నోయిడా అల్ల‌ర్ల వెనుక పాకిస్థాన్ హ‌స్తం ఉన్న‌ట్లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పాక్ ఉగ్ర‌వాదుల‌తో సంబంధాలు ఉన్నాయ‌న్న అనుమానంతో ప‌లువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తాజా ఘ‌ర్ష‌ణ‌ల్లో పాక్ ప్ర‌మేయం ఉందేమోన‌న్న అనుమానాలు క‌లుగుతున్నాయి. ఆ కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Also Read..

బీఆర్ఎస్‌లో చేరికతో నూతన అధ్యాయం మొదలు కాబోతున్న‌ది: జీవ‌న్‌రెడ్డి

మ‌రో రౌండ్ చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మైన అమెరికా-ఇరాన్‌..!

4జి ఫీచ‌ర్ ఫోన్ల‌కు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా మొబైల్ బ్యాంకింగ్ యాప్‌.. ఇక చెల్లింపులు ఎంతో సుల‌భం..

Advertisement
Advertisement