Ola S1 X Plus 5.2 kWh | ఒక్కసారి చార్జ్ చేస్తే 320 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల..
Ola S1 X Plus 5.2 kWh | ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్త్రిక్ తన నూతన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ఎక్స్ ప్లస్ 5.2 kWh మోడల్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. ఓలా ఎలక్ట్రిక్ సంస్థ స్వయంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్ టెక్నాలజీతో ఈ స్కూటర్ పనిచేస్తుంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1,29,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
Automobiles | Published On Apr 14, 2026, 11.45 am IST
Ola S1 X Plus 5.2 kWh | ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్త్రిక్ తన నూతన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ఎక్స్ ప్లస్ 5.2 kWh మోడల్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. ఓలా ఎలక్ట్రిక్ సంస్థ స్వయంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్ టెక్నాలజీతో ఈ స్కూటర్ పనిచేస్తుంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1,29,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అయితే ఈ ధర ఏప్రిల్ 15 తర్వాత మారే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. 4680 భారత్ సెల్ ను పూర్తిగా స్వదేశీ సెల్ టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేశారు. స్వదేశీ సెల్ టెక్నాలజీని సామాన్య వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని కంపెనీ తెలిపింది. ఈ ఇన్-హౌస్ టెక్నాలజీ ద్వారా ఎక్కువ దూర ప్రయాణ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో విస్తృతంగా అందించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
ఒక్కసారి చార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల ప్రయాణం..
ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్ 11 కిలోవాట్ మిడ్-డ్రైవ్ మోటార్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ ఎంసీయూ (MCU)తో పనిచేస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 125 కిలోమీటర్లుగా ఉంది. అదనంగా బ్రేక్-బై-వైర్ టెక్నాలజీ, ముందు డిస్క్ బ్రేక్‌లు వంటి ఆధునిక సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. 5.2 kWh బ్యాటరీ వేరియంట్ ఒక్కసారి చార్జ్‌తో 320 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
విస్త్రత మార్కెట్‌లకు తీసుకురావడమే లక్ష్యం..
ఈ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ ప్రతినిధులు మాట్లాడుతూ ఎస్1 ఎక్స్ ప్లస్ 5.2 kWh ద్వారా 4680 భారత్ సెల్ టెక్నాలజీని విస్తృత మార్కెట్‌కు తీసుకువస్తున్నామని తెలిపారు. అత్యాధునిక ఉత్పత్తుల్లో ఉపయోగించిన టెక్నాలజీని ఇప్పుడు మరింత విస్తృత వినియోగదారులకు అందించే దిశగా ఇది కీలక అడుగని పేర్కొన్నారు. పనితీరు, రేంజ్, విస్తరణ అనే మూడు అంశాల కలయికగా ఈ మోడల్ నిలుస్తుందని, దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడంలో ఇది సహకరిస్తుందని అన్నారు.
అనేక వేరియెంట్లు..
ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ తన పోర్ట్‌ఫోలియోలో జెన్ 3 ఎస్1 స్కూటర్లు, రోడ్‌స్టర్ ఎక్స్ మోటార్‌సైకిళ్లను అందిస్తోంది. ప్రీమియం విభాగంలో ఎస్1 ప్రొ ప్లస్ (5.2 kWh, 4 kWh), ఎస్1 ప్రొ (4 kWh, 3 kWh) మోడళ్లు ఉన్నాయి. గ్రామీణ వాహనదారులను దృష్టిలో ఉంచుకుని జెన్ 3 ఎస్1 ఎక్స్ ప్లస్ (4 kWh), అలాగే జెన్ 3 ఎస్1 ఎక్స్ (2 kWh, 3 kWh, 4 kWh) వేరియంట్లను అందుబాటులో ఉంచారు. అలాగే ఓలా రోడ్ స్టర్ మోటార్‌సైకిళ్లు 4.5 kWh, 9.1 kWh బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుండగా, రోడ్‌స్టర్ ఎక్స్ మోడల్ 2.5 kWh, 3.5 kWh, 4.5 kWh కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

AJA Consulting Services | ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ప్రకటించిన అజా కన్సలిస్టింగ్ సర్వీసెస్
మే 20, 2026

PM Modi Convoy | రెండు కార్ల కాన్వాయ్‌తోనే ప్రధాని మోదీ ప్రయాణం.. వాటి ప్రత్యేకతలు తెలుసా..?
మే 14, 2026

PM Modi Convoy | తొలిసారి.. రెండు వాహనాల కాన్వాయ్‌తోనే ప్రధాని ప్రయాణం.. VIDEO
మే 13, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



