Ponnam Prabhakar | ట్యాంక్‌బండ్‌పై రూ. 4 కోట్లతో పూలే దంపతుల విగ్రహాలు: పొన్నం
Ponnam Prabhakar | మహాత్మా జ్యోతిబాపులే (Jyothiba Phule) సామాజిక న్యాయం కోసం ఎన్నో పోరాటాలు చేశారని.. పూలే దంపతుల విగ్రహాలు (Statues) ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. సావిత్రి బాయి పూలే (Savithri Bhayi Phule) మహిళల చదువు కోసం ఉద్యమించిన ధీర వనిత అని కొనియాడారు. దాదాపు 4 కోట్ల తో వారి విగ్రహాలను ట్యాంక్ బండ్ (Tank bund) ఐమాక్స్ థియేటర్ ఎదురుగా లేక్ వ్యూ పార్క్ వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
త్రినేత్ర.న్యూస్: మహాత్మా జ్యోతిబాపులే (Jyotiba phule) సామాజిక న్యాయం కోసం ఎన్నో పోరాటాలు చేశారని.. పూలే దంపతుల విగ్రహాలు (Statues) ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. సావిత్రి బాయి పూలే (Savuthri bhayi phule) మహిళల చదువు కోసం ఉద్యమించిన ధీర వనిత అని కొనియాడారు. దాదాపు 4 కోట్ల తో వారి విగ్రహాలను ట్యాంక్ బండ్ (Tank bund) ఐమాక్స్ థియేటర్ ఎదురుగా లేక్ వ్యూ పార్క్ వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా విగ్రహ నిర్మాణ పురోగతి పనులను మంత్రి కొండా సురేఖతో కలిసి పొన్నం పరిశీలించారు.
సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
అనంతరం ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి విగ్రహావిష్కరణ ప్రారంభంపై సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల ముందే విగ్రహ ఏర్పాటు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సభ ప్రాంగణంలో ఎవరికి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ట్యాంక్ బండ్ పై మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు కృషి చేసిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
పూలే మార్గ్ గా పేరు?
జ్యోతి బాపులే సావిత్రి బాయి పూలే విగ్రహాలకు ఒక పక్కన ఇందిరా గాంధీ, మరో పక్కన మహనీయుడు బీఆర్ అంబేద్కర్, ఆర్థిక సంస్కరణల నిపుణులు పీవీ నరసింహారావు విగ్రహాలు ఉండడం సంతోషకరమన్నారు. మహనీయులు ఉన్న ఈ ప్రాంతం నేటితరానికి వారి జీవిత చరిత్ర తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఈ మార్గానికి పూలే మార్గ్ గా పేరు పెట్టాలని స్థానిక శాసన సభ్యులు దానం నాగేందర్ సూచించారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని పొన్నం పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఆశీర్వాదంతో ప్రజా పాలన ప్రభుత్వం వచ్చిందని.. అందుకే ప్రగతి భవన్ కు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా పేరు మార్చుకున్నట్లు చెప్పారు. విగ్రహాలు చూడగానే వారి జీవిత చరిత్ర ప్రజల్లో ఆలోచింపజేసేలా చేస్తాయన్నారు. వెనుకబడిన వర్గాల సామాజిక న్యాయం కోసం మహాత్మా జ్యోతిబా పూలే పోరాటాలు చేశారని గుర్తు చేశారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన వారు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ , ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కవ్వంపల్లి సత్యనారాయణ, నవీన్ యాదవ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, మాజీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, కార్పొరేషన్ చైర్మన్ లు, నూతి శ్రీకాంత్ గౌడ్, మెట్టు సాయి కుమార్, జెరిపాటి జైపాల్, బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్, దాసు, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయాదేవి, హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
మే 21, 2026

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



