త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

jayalalithaa | హైదరాబాద్‌లో ఉన్న జయలలిత ఇల్లు సీజ్

jayalalithaa | హైద‌రాబాద్‌లో ఉన్న‌ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత‌ (jayalalithaa)కు చెందిన ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు (ghmc officials) సీజ్ చేశారు. న‌గ‌రంలోని శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీలో ఉన్న ఈ భ‌వ‌నంపై ఆస్తి ప‌న్ను బ‌కాయిలు ఉండ‌టంతో ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు అధికారులు తెలిపారు.

D

Telangana | Published On Mar 31, 2026, 11.26 am IST

jayalalithaa | హైదరాబాద్‌లో ఉన్న జయలలిత ఇల్లు సీజ్
Advertisement

jayalalithaa | హైద‌రాబాద్‌లో ఉన్న‌ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత‌ (jayalalithaa)కు చెందిన ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు (ghmc officials) సీజ్ చేశారు. న‌గ‌రంలోని శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీలో ఉన్న ఈ భ‌వ‌నంపై ఆస్తి ప‌న్ను బ‌కాయిలు ఉండ‌టంతో ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఆ ఇంటిపై సుమారు రూ.1.60 కోట్ల మేర ఆస్తి ప‌న్ను బ‌కాయి ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఈ విష‌యంపై ప‌లుమార్లు జ‌య‌ల‌లిత కుటుంబ స‌భ్యులకు నోటీసులు ఇచ్చినా స్పంద‌న లేక‌పోవ‌డంతో చివ‌రికి భ‌వ‌నాన్ని సీజ్ చేసిన‌ట్లు పేర్కొన్నారు. గతంలో ఈ భవనాన్ని వ్యాపారవేత్త విజ‌య్ మాల్యా లీజుకు తీసుకున్నట్లు సమాచారం. 2017 నుంచి ఆస్తి పన్ను బకాయి ప‌డిన‌ట్లు తెలిసింది.

కాగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీలో 90 శాతం రాయితీ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) పథకాన్ని అమ‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే. పాత బకాయిలపై ఉన్న వడ్డీలో కేవలం 10% వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఓటీఎస్‌ పథకం నేటితో అంటే మార్చి 31తో ముగియనుంది. ఏప్రిల్‌ 1 నుంచి రూల్స్ మారతాయి. అప్పట్నుంచి ఆస్తి పన్నును వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఈ చెల్లింపులు కేవలం ఆన్‌లైన్ (www.ghmc.gov.in, MyGHMC యాప్, మీసేవా కేంద్రాలు) ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

Also Read..

ఇరాన్ నుంచి భార‌త్‌కు వ‌చ్చే విమానంపై అమెరికా దాడి

భారీగా ప‌త‌న‌మైన ఆసియా మార్కెట్లు.. ట్రంప్ తాజా హెచ్చ‌రిక‌ల వ‌ల్ల‌నే..?

పెద్ది వ‌స్తుందా? ...వాయిదా? - రామ్‌చ‌ర‌ణ్ మూవీ రిలీజ్‌పై డైల‌మా

Advertisement

తాజావార్తలు

Advertisement