Primordial Black Holes | ఆదిమ కృష్ణబిలం జాడ చిక్కింది..! శాస్త్రవేత్తలు ఏమన్నారంటే..!
Primordial Black Holes | విశ్వం ఆవిర్భావ సమయంలోనే ఏర్పడ్డాయని భావిస్తున్న ప్రాథమిక కృష్ణబిలాలు (PBHs) గురించి శాస్త్రవేత్తలు కీలక విషయాలను గుర్తించారు. ఇప్పటివరకు కేవలం సిద్ధాంతాలకే పరిమితమైన ఈ కృష్ణబిలాల ఉనికి నిజమై ఉండొచ్చని తాజా పరిశోధన సూచిస్తోంది. సాధారణంగా కృష్ణబిలాలు భారీ నక్షత్రాల చివరిదశలో సూపర్‌నోవాగా పేలిపోయి కూలినపోయిన సమయంలో అవి కృష్ణబిలాలుగా మారుతాయి.
Primordial Black Holes | విశ్వం ఆవిర్భావ సమయంలోనే ఏర్పడ్డాయని భావిస్తున్న ప్రాథమిక కృష్ణబిలాలు (PBHs) గురించి శాస్త్రవేత్తలు కీలక విషయాలను గుర్తించారు. ఇప్పటివరకు కేవలం సిద్ధాంతాలకే పరిమితమైన ఈ కృష్ణబిలాల ఉనికి నిజమై ఉండొచ్చని తాజా పరిశోధన సూచిస్తోంది. సాధారణంగా కృష్ణబిలాలు భారీ నక్షత్రాల చివరిదశలో సూపర్‌నోవాగా పేలిపోయి కూలినపోయిన సమయంలో అవి కృష్ణబిలాలుగా మారుతాయి. ఇవి చాలా పెద్ద పరిమాణంలో ఉంటాయి. కానీ ప్రాథమిక కృష్ణబిలాలు మాత్రం విశ్వం పుట్టిన వెంటనే, అంటే బిగ్ బ్యాంగ్ తర్వాత క్షణాల్లోనే సబ్‌ఆటామిక్ స్థాయిలోని పదార్థాల నుంచి ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అమెరికాలోని మియామి విశ్వవిద్యాలయానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు అల్బెర్టో మగరాగియా, నికో కపెల్లుటి ఈ అంశంపై పరిశోధనలు నిర్వహించారు. వాషింగ్టన్, లూసియానాలో ఉన్న లేసర్ ఇంటర్‌ఫెరోమీటర్ గ్రావిటేషనల్-వేవ్ అబ్జర్వేటరీ (లైగో) ద్వారా నమోదైన సంకేతాలను విశ్లేషించి, ప్రాథమిక కృష్ణబిలాన్ని గుర్తించినట్లు తెలిపారు. అమెరికాలోని మియామి విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు లైగో (LIGO) అనే పరికరం ద్వారా వచ్చిన సంకేతాలను విశ్లేషించారు. లైగో అనేది అంతరిక్షంలో జరిగే భారీ ఢీ కొనుళ్ల వల్ల ఉత్పత్తి అయ్యే గ్రావిటేషనల్ తరంగాలను గుర్తించే ప్రత్యేక పరికరం. రెండు కృష్ణబిలాలు ఢీకొన్నట్లు ఒక సంకేతం లభించగా, అందులో ఒక కృష్ణబిలం బరువు సూర్యుడి కంటే కూడా తక్కువగా ఉందని గుర్తించారు. సాధారణంగా కృష్ణబిలాలు అంత తక్కువ బరువుతో ఉండవు.
కాబట్టి అది ప్రాథమిక కృష్ణబిలం కావచ్చని శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంకేతానికి ‘S251112cm’ అనే పేరు పెట్టారు. దీనిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉన్నప్పటికీ, ఇది ఇప్పటివరకు లభించిన బలమైన ఆధారాల్లో ఒకటిగా భావిస్తున్నారు. ప్రాథమిక కృష్ణబిలాలు ఎందుకు ముఖ్యమంటే.. విశ్వంలో ఉన్న ‘డార్క్ మ్యాటర్’ అనే రహస్య పదార్థం గురించి వివరించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ డార్క్ మ్యాటర్ మనకు కనిపించదు కానీ విశ్వంలో దాదాపు 85 శాతం ద్రవ్యరాశి దీనిదేనని అంచనా. అయితే, ఈ కృష్ణబిలాలను గుర్తించడం చాలా కష్టం. ఇవి వెలుతురును విడుదల చేయవు. పైగా చాలా చిన్న పరిమాణంలో ఉండే అవకాశం ఉంది. అందుకే వీటిని ‘విశ్వంలో సూదిని వెతికినట్లే’నని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. ఇలాంటి కృష్ణబిలాలు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయి.
లైగో ఇప్పటివరకు గుర్తించిన డేటా కూడా అదే విషయాన్ని సూచిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి సంకేతాలు లభిస్తేనే ప్రాథమిక కృష్ణబిలాల ఉనికిని ఖచ్చితంగా నిర్ధారించగలుగుతామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లైగో వంటి పరికరాలను మరింత అభివృద్ధి చేయడం, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2035లో ప్రయోగించనున్న లీసా (ఇంటర్‌ఫెరోమీటర్ స్పేస్ యాంటెన్నా) వంటి కొత్త డివైజెస్ అందుబాటులోకి వస్తే ఈ పరిశోధనలకు మరింత ఊతం లభించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లైగో ఇప్పటివరకు ఈ తరహా కృష్ణబిలాల ఉనికిని సూచించే బలమైన ఆధారాలను అందించిందని, అయితే పూర్తిస్థాయి నిర్ధారణ కోసం మరిన్ని సంకేతాలు అవసరమని కపెటిల్లు తెలిపారు. ఈ పరిశోధన వివరాలు త్వరలో ‘ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్’లో ప్రచురితమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ అధ్యయనం ఆర్కైవ్‌లో అందుబాటులో ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
సెప్టెంబర్ 22, 2026

Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..
సెప్టెంబర్ 22, 2026

Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Banks Open on Sunday 27th September | కస్టమర్లకు గుడ్‌న్యూస్: ఆదివారం సెప్టెంబర్ 27 నాడు బ్యాంకులు ఓపెన్.. ఎందుకంటే?
- ●Congress MLA | ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా
- ●CM Revanth Reddy | కర్ణాటక సీఎంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు
- ●Jurala Project | జూరాలకు నీటి విడుదల.. కర్ణాటక ప్రభుత్వం అంగీకారం
- ●Nani The Paradise movie | నాని 'ది ప్యారడైజ్' ప్రీమియర్ కోరిక.. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ ఏమన్నారంటే?
- ●Adobe Premiere | ఆండ్రాయిడ్ ఫోన్లకు అడోబ్ ప్రీమియర్.. ఇక ఫోన్లోనే 4కె వీడియో ఎడిటింగ్..

Banks Open on Sunday 27th September | కస్టమర్లకు గుడ్‌న్యూస్: ఆదివారం సెప్టెంబర్ 27 నాడు బ్యాంకులు ఓపెన్.. ఎందుకంటే?

Congress MLA | ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా

CM Revanth Reddy | కర్ణాటక సీఎంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు

Jurala Project | జూరాలకు నీటి విడుదల.. కర్ణాటక ప్రభుత్వం అంగీకారం



