KVS Admissions | కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు.. ఆన్‌లైన్ దరఖాస్తులు షురూ
KVS Admissions | దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (KVS) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బాలవాటిక, ఒకటో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ (KVS Admissions) విడుదలైంది. ఏప్రిల్ 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
KVS Admissions | త్రినేత్ర.న్యూస్: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (KVS) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బాలవాటిక, ఒకటో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ (KVS Admissions) విడుదలైంది. ఏప్రిల్ 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పని చేస్తున్నవారి పిల్లలకు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది. కొన్ని సీట్లను వివిధ కోటాలు, రిజర్వేషన్ల ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
ఒకటో తరగతి, బాల్‌వాటికల్లో ఒకటి, రెండో, మూడో తరగతి ప్రవేశాలకు మాత్రమే ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. మిగిలిన తరగతుల్లో ఖాళీలను బట్టి ఆయా కేవీ విద్యాలయాల్లో స్వయంగా వెళ్లి దరఖాస్తులు సమర్పించవల్సి ఉంటుంది. బాల్‌వాటిక 2, రెండో తరగతి నుంచి (11వ తరగతి మినహా) 9వ తరగతి వరకు ఖాళీలను బట్టి ఏప్రిల్ 2 నుంచి 8 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు..
ఒకటో తరగతిలో ప్రవేశాలు పొందాలంటే విద్యార్ధుల వయసు 2026 మార్చి 31 నాటికి ఆరేండ్లు నిండి ఉండాలి. అదేవిధంగా బాలవాటికలో చేరాలనుకునే చిన్నారులకు 3 సంవత్సరాలు నిండి ఉండాలి.
అడ్మిషన్ ప్రక్రియ
ఆన్‌లైన్ లాటరీ విధానంలో బాల వాటిక, 1వ తరగతి ప్రవేశాలు కల్పిస్తారు. సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ సిస్టం ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. 2 నుంచి ఆపై తరగతుల్లో ఖాళీలను ఆఫ్లైన్లో భర్తీ చేస్తారు.
బాలవాటిక మొదటి జాబితా ఏప్రిల్ 8న, ఒకటో తరగతి మొదటి జాబితా ఏప్రిల్ 9న విడుదల చేస్తారు. సీట్ల ఖాళీలను బట్టి రెండో జాబితాను ఏప్రిల్ 16న, మూడో జాబితా ఏప్రిల్ 21న ప్రకటిస్తారు.
ఏయే పత్రాలు కావాలంటే..
- పిల్లల బర్త్ సర్టిఫికెట్
- ఆధార్ కార్డు
- ఫోటో
- తల్లిదండ్రుల మొబైల్ నంబర్ఈ
- మెయిల్ ఐడీ
- నివాస ధ్రువీకరణ పత్రం
- ఈడబ్ల్యూఎస్, రిజర్వేషన్ సర్టిఫికేట్లు
- ప్రభుత్వ ఉద్యోగులైతే సర్వీస్ సర్టిఫికేట్, ట్రాన్స్‌ఫర్ వివరాలు తప్పనిసరి
ముఖ్యమైన తేదీలు..
- దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 2
- తొలి ఎంపిక జాబితా (బాల్‌వాటికలకు): ఏప్రిల్ 8
- తొలి ఎంపిక జాబితా (ఒకటో తరగతి): ఏప్రిల్ 9
- రెండో జాబితా: ఏప్రిల్ 16
- మూడో జాబితా: ఏప్రిల్ 21
వెబ్‌సైట్: https://kvsangathan.nic.in/en/admission/
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



