త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trump Advisers Urge Exit Plan From Iran War | యుద్ధం నుంచి వైదొలుగుదాం.. ట్రంప్‌పై సలహాదారుల ఒత్తిడి

Trump Advisers Urge Exit Plan From Iran War | ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా నేత‌లు ఆందోళ‌న చెందుతున్న‌ట్లు తెలుస్తోంది. యుద్ధం నుంచి వెంటనే వైదొలగాలని ట్రంప్‌పై ఒత్తిడి పెంచుతున్నార‌ట‌. ఈ మేర‌కు వాల్‌స్ట్రీట్ జ‌ర్న‌ల్ (Wall Street Journal) సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

D

International | Published On Mar 10, 2026, 12.15 pm IST

Trump Advisers Urge Exit Plan From Iran War | యుద్ధం నుంచి వైదొలుగుదాం.. ట్రంప్‌పై సలహాదారుల ఒత్తిడి
Advertisement

Trump Advisers Urge Exit Plan From Iran War | ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా నేత‌లు ఆందోళ‌న చెందుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ యుద్ధం కార‌ణంగా చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డ‌మేకాకుండా.. రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ స‌ల‌హాదారులు భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు యుద్ధం నుంచి వెంటనే వైదొలగాలని ట్రంప్‌పై ఒత్తిడి పెంచుతున్నార‌ట‌. ఈ మేర‌కు వాల్‌స్ట్రీట్ జ‌ర్న‌ల్ (Wall Street Journal) సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం నుండి వెదొలిగేందుకు ఒక వ్యూహాన్ని రూపొందించాలని ట్రంప్‌కు ఆయన సలహాదారులు సూచిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. దీర్ఘ‌కాలిక యుద్ధం వ‌ల్ల క‌లిగే న‌ష్టాల‌ను నివారించ‌డంతోపాటూ ఈ సంఘ‌ర్ష‌ణ‌ను విజ‌య‌వంత‌మైన ఆప‌రేష‌న్‌గా ముగించ‌డం మంచిద‌ని భావిస్తున్న‌ట్లు పేర్కొంది. అందుకే యుద్ధం నుంచి వైదొలిగేందుకు వ్యూహాన్ని రూపొందించాల‌ని అధ్య‌క్షుడిపై ఒత్తిడి చేస్తున్న‌ట్లు స‌దరు నివేదిక వెల్ల‌డించింది. ఇరాన్‌కు చెందిన కీల‌క సైనిక సామర్థ్యాలను ఇప్పటికే దెబ్బతీశామని, దీన్ని "విజయవంతమైన మిషన్" (Successful Mission)గా ప్రకటించి సైన్యాన్ని వెనక్కి పిలిపించాలని వారు సూచిస్తున్నట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ నివేదించింది. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే అమెరికా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, ఇది రాబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి గట్టి దెబ్బ కొడుతుందని వారు హెచ్చరిస్తున్నార‌ట‌.

ఈ ఒత్తిళ్ల నేప‌థ్యంలో యుద్ధంపై ట్రంప్ విరుద్ధ ప్ర‌క‌ట‌నలు చేశారు. సైనిక చ‌ర్య చివ‌రి ద‌శ‌కు చేరుకుంద‌ని, అనుకున్న‌దానికంటే ముందే యుద్ధాన్ని ముగిస్తామ‌ని వ్యాఖ్యానించారు. మిలిట‌రీ ప‌రంగా సాధించాల్సిన ల‌క్ష్యాల‌ను దాదాపుగా పూర్తి చేసిన‌ట్లు వెల్ల‌డించారు. అతి త్వరలో యుద్ధానికి ముగింపు పలుకుతామని ట్రంప్ ధీమా వ్య‌క్తం చేశారు. అదే స‌మ‌యంలో ఇరాన్ పూర్తిగా ఓడిపోయే వ‌ర‌కూ యుద్ధం కొన‌సాగిస్తామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Also Read..

Iran War | యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో డిసైడ్ చేసేది మేము.. అమెరికా కాదు : ఇరాన్‌

Gas Supply | రంగాల వారిగా గ్యాస్ స‌ర‌ఫ‌రా కేటాయింపుల‌ను ప్ర‌క‌టించిన కేంద్రం

NCERT | 8వ తరగతి బుక్‌లో వివాదాస్ప‌ద అధ్యాయంపై క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఎన్‌సీఈఆర్‌టీ

Advertisement
Advertisement