NCERT | 8వ తరగతి బుక్‌లో వివాదాస్పద అధ్యాయంపై క్షమాపణలు చెప్పిన ఎన్‌సీఈఆర్‌టీ
NCERT | నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ (corruption in the judiciary)పై ఓ అధ్యాయాన్ని ప్రచురించడం ఇటీవలే తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
NCERT | నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ (corruption in the judiciary)పై ఓ అధ్యాయాన్ని ప్రచురించడం ఇటీవలే తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఎన్‌సీఈఆర్‌టీ తాజాగా స్పందించింది. ఈ మేరకు బేషరుతుగా బహిరంగ క్షమాపణలు చెప్పింది. అంతేకాదు ఈ పుస్తకాన్ని ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. ఇకపై ఈ బుక్ అందుబాటులో ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
సుప్రీంకోర్టు ఆగ్రహం..
కాగా, ఈ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) గత నెల సుమోటోగా విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం న్యాయవ్యవస్థలో అవినీతికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్న ఈ పుస్తకం పంపిణీని నిషేధించింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఘాటుగా స్పందించారు. న్యాయవ్యవస్థ యొక్క సమగ్రతను కించపరిచేలా లేదా దిగజార్చేలా చేసే ఏ ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు అనుమతించదని హెచ్చరించారు.
"వాళ్లు ప్రయోగించిన బుల్లెట్‌తో న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా అనిపిస్తోంది. దీనిపై మేము లోతైన విచారణ కోరుకుంటున్నాము. దీనికి బాధ్యులు ఎవరో మేము తెలుసుకోవాలి. వారు ఎంతటి వారైనా సరే.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు" అని హెచ్చరించిన విషయం తెలిసిందే. సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచ్చిన రెండు వారాలకు ఇప్పుడు ఎన్‌సీఈఆర్‌టీ బేషరతుగా క్షమాపణలు చెప్పింది.
Also Read..
Iran War | యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో డిసైడ్ చేసేది మేము.. అమెరికా కాదు : ఇరాన్
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






