Iran War | యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో డిసైడ్ చేసేది మేము.. అమెరికా కాదు : ఇరాన్
Iran War | ఇరాన్‌లో యుద్ధాన్ని (Iran War) ముగిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో డిసైడ్ చేసేది అమెరికా కాదని.. తామే అని ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ (Islamic Revolutionary Guard Corps) తెలిపింది.
International | Published On Mar 10, 2026, 11.10 am IST
Iran War | ఇరాన్‌లో యుద్ధాన్ని (Iran War) ముగిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో డిసైడ్ చేసేది అమెరికా కాదని.. తామే అని ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ (Islamic Revolutionary Guard Corps) తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై సైనిక చర్యలను ఎప్పుడు ఆపాలో తామే నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. ఈ ప్రాంత భవిష్యత్తు టెహ్రాన్ దళాల చేతుల్లోనే ఉందని తెలిపింది.
"ఈ యుద్ధం ఎప్పుడు ముగించాలో మేమే నిర్ణయిస్తాం. ఈ ప్రాంత సమీకరణాలు, భవిష్యత్తు స్థితిగతులు ఇప్పుడు మా సాయుధ దళాల చేతుల్లో ఉన్నాయి. అమెరికా దళాలు ఈ యుద్ధాన్ని ముగించలేవు" అని ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది. అంతకు ముందు ఇరాన్‌తో యుద్ధం స్వల్పకాలం మాత్రమే ఉండొచ్చని ట్రంప్ పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన నాయకుడి నాయకత్వంలోని ఇరాన్.. ప్రపంచ చమురు సరఫరాకు ఆటంకం కలిగిస్తే యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. "త్వరలోనే అనుకుంటున్నాను. అతి త్వరలో యుద్ధం ముగింపు పలుకుతాము" అని ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన ఇరాన్.. యుద్ధం ముగింపు తమ చేతుల్లో ఉందని వ్యాఖ్యానించింది.
Also Read..
Stock Markets | యుద్ధం ముగుస్తుందని సంకేతాలు.. పుంజుకున్న స్టాక్ మార్కెట్లు..
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






