త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nobel Prize in Literature | కెన‌డా ర‌చ‌యిత్రి అన్నె కార్సన్‌కు సాహిత్య నోబెల్‌

Nobel Prize in Literature | కెన‌డాకు చెందిన ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి అన్నె కార్సన్ (Anne Carson) సాహిత్య నోబెల్ బ‌హుమ‌తికి (Nobel Prize in Literature) ఎన్నిక‌య్యారు. సాహిత్యంలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం దక్కింది.

D

International | Published On Oct 8, 2026, 5.17 pm IST

Nobel Prize in Literature | కెన‌డా ర‌చ‌యిత్రి అన్నె కార్సన్‌కు సాహిత్య నోబెల్‌
Advertisement

Nobel Prize in Literature | త్రినేత్ర న్యూస్ : ఈ ఏడాది కెన‌డాకు చెందిన ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి అన్నె కార్సన్ (Anne Carson) సాహిత్య నోబెల్ బ‌హుమ‌తికి (Nobel Prize in Literature) ఎన్నిక‌య్యారు. సాహిత్యంలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం దక్కింది. ప్రాచీన సంప్రదాయ సాహిత్యంతో సంభాషిస్తూనే.. సమకాలీన సాహిత్యం కోసం స‌రికొత్త రూపాల‌ను సృష్టించిన ఆమె సాహ‌సోపేత‌మైన‌, సృజ‌నాత్మ‌క ర‌చ‌న‌ల‌కు గానూ ఆమెకు ఈ పురస్కారం అందజేస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. కాగా, గ‌తేడాది హంగేరియన్‌ రచయిత లాస్లో క్రాస్నాహోర్కై సాహిత్య నోబెల్ అందుకున్న విష‌యం తెలిసిందే.

కాగా, ఇప్ప‌టి వ‌ర‌కూ 18 మంది మ‌హిళ‌ల‌కు సాహిత్య రంగంలో నోబెల్ బ‌హుమ‌తి ల‌భించింది. 1909లో తొలిసారి స్వీడిష్ రచయిత్రి సెల్మా లాగర్ లోఫ్ ఈ పుర‌స్కారాన్ని అందుకున్నారు. 1901 నుంచి 2026 వరకు 119 సార్లు సాహిత్యంలో నోబెల్‌ ప్రకటించ‌గా.. ఇప్పటివరకు 123 మంది రచయితలు/కవులు అందుకున్నారు. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన ఏకైక భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్ కావ‌డం విశేషం. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ (Alfred Nobel) పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న విషయం తెలిసిందే. ఆయ‌న‌ వర్ధంతి రోజైన డిసెంబర్‌ 10న విజేతలకు అవార్డులను అందజేస్తారు. అవార్డు గ్రహీతలకు 12 లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ నగదు అందుతుంది.

Also Read..

ఈసీని అస్థిర‌ప‌రిస్తే ప్ర‌జాస్వామ్యానికే ముప్పు.. నిర‌స‌న‌ల వేళ ఈసీకి మ‌ద్దతుగా రిటైర్డ్ జ‌డ్జీలు

భార‌త స్టాక్ మార్కెట్ల‌కు గ‌డ్డుకాలం.. ఇప్ప‌ట్లో కోలుకునే ప‌రిస్థితి లేదా..?

మురికి బ‌ట్ట‌లు, ఒంటి నిండా చెమ‌ట‌తో పేనీల త‌యారీ.. అధికారుల త‌నిఖీల్లో వెలుగులోకి

Advertisement
Advertisement