త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Safe Rides | మురికి బ‌ట్ట‌లు, ఒంటి నిండా చెమ‌ట‌తో పేనీల త‌యారీ.. అధికారుల త‌నిఖీల్లో వెలుగులోకి

TG Safe Rides | బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా, దీపావ‌ళి పండ‌గల‌ వేళ పేనీల త‌యారీలో ప‌రిశుభ్ర‌త‌ను గాలికొదిలేస్తున్నారు. వ్యాపారం ముసుగులో క‌నీస శుభ్ర‌త‌ను పాటించ‌డం లేదు.

S

Telangana | Published On Oct 8, 2026, 5.07 pm IST

TG Safe Rides | మురికి బ‌ట్ట‌లు, ఒంటి నిండా చెమ‌ట‌తో పేనీల త‌యారీ.. అధికారుల త‌నిఖీల్లో వెలుగులోకి
Advertisement

TG Safe Rides | త్రినేత్ర న్యూస్‌: బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా, దీపావ‌ళి పండ‌గల‌ వేళ పేనీల త‌యారీలో ప‌రిశుభ్ర‌త‌ను గాలికొదిలేస్తున్నారు. వ్యాపారం ముసుగులో క‌నీస శుభ్ర‌త‌ను పాటించ‌డం లేదు. గౌలిపురా, మలక్‌పేట, జియాగూడ, బాదంగ్‌పేట ప్రాంతాల్లోని 12 పానీ తయారీ కేంద్రాల్లో టీజీ సేఫ్ ఫుడ్ విభాగం, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం నిర్వ‌హించిన త‌నిఖీల్లో ప‌లు లోపాలు వెలుగులోకి వ‌చ్చాయి.

తనిఖీల్లో పలు కేంద్రాల్లో అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొందరు కార్మికులు క్యాపులు, గ్లౌజులు లేకుండానే ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మరికొన్ని చోట్ల మురికి దుస్తులతో, ఒంటి నిండా చెమటతోనే ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముడి పదార్థాలు, తయారైన పానీని నేలపైనే ఉంచినట్లు తనిఖీల్లో వెల్లడైంది.

కొన్ని కేంద్రాల్లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్స్‌తో పాటు ఇతర అనుమతులు అందుబాటులో లేకపోవడం లేదా ప్రాంగణంలో ప్రదర్శించకపోవడం కూడా గుర్తించారు. క్యూర్ పరిధిలోని 12 యూనిట్లను అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో గుర్తించిన ఉల్లంఘనల ఆధారంగా సంబంధిత యూనిట్లపై చర్యలు తీసుకుంటామ‌ని అధికారులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement